డ్రగ్స్ రహిత సమాజం నిర్మిద్దాం : జడ్జి స్వరూపరాణి
పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్: డ్రగ్స్ రహిత సమా జ నిర్మాణం కోసం కృషి చేయాలని సీనియర్ సివిల్ జడ్జి స్వప్నరాణి కోరారు. డ్రగ్స్‌తో కలిగే నష్టాలపై అవగాహన కల్పించేందుకు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సోమవారం ము గ్గుల పోటీలు నిర్వహించారు. జడ్జి హాజరై మా ట్లాడారు. చట్టాలపై ప్రతీఒక్కరు అవగాహన క లిగి ఉండాలన్నారు. పిల్లలతో స్నేహపూర్వకంగా ఉంటూ గుడ్‌టచ్, బ్యాడ్‌టచ్‌పై అవగాహన కలిగించాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్, జండర్ స్పెషలిస్ట్ సుచరిత, మె ప్మా ఇన్‌చార్జి టీఎంసీ స్వప్న పాల్గొన్నారు.
వెండి నాణేలపై విచారణ
జూలపల్లి(పెద్దపల్లి): చీమలపేటలోని ఓ పా డుబడిన ఇంటిస్థలాన్ని చదును చేస్తుండగా ల భించిన వెండి నాణేలపై రెవెన్యూ అధికారులు సోమవారం విచారణ ప్రారంభించారు. శనివా రం సాయంత్రం నాణేలు లభించగా బయట కు పొక్కనీయలేదు. ఆదివారం బహిర్గతం కా వడంతో గ్రామస్తులు మరికొన్నింటి కోసం ఆ స్థలంలో వెతకడం ప్రారంభించారు. సమాచా రం అందుకున్న పోలీసులు విచారణ జరపగా 9 నాణేలు లభించాయి. ఈమేరకు నాయబ్ తహసీల్దార్ అనిల్ కుమార్ సోమవారం విచారణ జరిపారు. నాణేలపై ఒకవైపు చార్మినార్, మరోవైపు ఉర్దూ అక్షరాల్లో రాసి ఉందని అధి కారులు తెలిపారు. ఇవి 1900వ సంవత్సరాని కి చెందినవిగా భావిస్తున్నామని, 10 నాణేలు స్వాధీనం చేసుకున్నామని పోలీస్‌స్టేషన్‌లో అ ప్పగిస్తామని నాయబ్ తహసీల్దార్ తెలిపారు. ఒక్కోటి ఒక తులం బరువు ఉందన్నారు.
క్వింటాల్ పత్తి రూ.7,017
పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో సోమవారం పత్తి క్వింటాల్‌కు గరిష్టంగా రూ.7,017 ధర పలికింది. కనిష్టంగా రూ.5,501, సగటు ధర రూ.6,750గా నమో దు అయ్యిందని మార్కెట్ ఇన్‌చార్జి కార్యదర్శి మనోహర్ తెలిపారు. జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన 472 మంది రైతులు మార్కెట్‌కు తెచ్చిన 1,273 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్లు ఆయన వివరించారు.
హమాలీల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
పెద్దపల్లి: హమాలీల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎ దుట హమాలీలతో కలిసి సోమవారం ధర్నా చేశారు. ఆయన మాట్లాడుతూ, కూలిరేట్లు పెంచాలన్నారు. బీమా, పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వమే గుర్తింపు కా ర్డులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం అడిషనల్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. నాయకులు సిపెల్లి రవీందర్, అంజయ్య, గంగయ్య, సత్తయ్య, తిరుపతి, శంకరయ్య, రాజవెల్లి, సత్తయ్య, తిరుపతి, కనకయ్య, నంబయ్య, గట్టయ్య, శ్రీనివాస్, క్యా దాషి నర్సయ్య, దేవయ్య పాల్గొన్నారు.
ఇప్పుడే వరికోతలు వద్దు
ఎలిగేడు(పెద్దపల్లి): రానున్న మూడు రోజుల పాటు జిల్లావ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందనే వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో రైతులు వరి కోతలు చేపట్టవద్దని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్ సూచించారు. సుల్తాన్‌పూర్‌లోని వరి పొలాలను సోమవారం ఆయన పరిశీలించారు. రైతు ఊర సత్యనారాయణరావు తన పొలంలో సాగు చేసిన దాన్ –75 రకం వరిపంట పిలకలు, గొలుసులు, గింజబరువు పరిశీలించారు. త్వరలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. మండల వ్యవసాయ అధికారి ఉమాపతి, ఏఈవో గణేశ్, రైతులు పాల్గొన్నారు.
డ్రగ్స్ రహిత సమాజం నిర్మిద్దాం : జడ్జి స్వరూపరాణి
డ్రగ్స్ రహిత సమాజం నిర్మిద్దాం : జడ్జి స్వరూపరాణి
డ్రగ్స్ రహిత సమాజం నిర్మిద్దాం : జడ్జి స్వరూపరాణి


