పనులు చేపడుతూనే జవాబిస్తాం
గోదావరిఖని: అభివృద్ధి పనులు చేపడుతూ, తమ పనితీరుతోనే ప్రజలకు జవాబిస్తామని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ అన్నారు. నగరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సామాన్యులకు నష్టం కలిగించే పనులు చేప్టబోమని, అభివృద్ది విషయంలో రాజీపడే ప్రసక్తేలేదని అన్నారు. నియోజవర్గంలో రూ.676.50కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని ఎమ్మెల్యే తెలిపారు. మరో రూ.వంద కోట్లతో సింగరేణి కార్మికవాడల్లో ప్రగతిపనులు చేపట్టిందన్నారు. ఎస్టీపీపీల ద్వారా మురుగునీటిని శుద్ధి చేస్తామని చెప్పారు. బీ –గెస్ట్‌హౌస్ వద్ద ఐర్లాండ్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. రూ.7.5కోట్లతో ప్రభుత్వ జూనియర్ కాలేజీ భవనం నిర్మిస్తామని ఆయన పేర్కొన్నారు. ఆర్‌ఎఫ్‌సీఎల్ బాధితులు ఫిర్యాదు చేస్తే చర్యలు తీ సుకుంటామని ఆయన అన్నారు. నాయకులు బొంతల రాజేశ్, మహంకాళి స్వామి, మారెల్లి రాజిరెడ్డి, లింగస్వామి, పెద్దెల్లి ప్రకాశ్, ముస్తాఫా, దీటి బాలరాజు, కొలిపాక సుజాత తదితరులు పాల్గొన్నారు.


