లైసెన్స్‌డ్ సర్వేయర్లు వస్తున్నారు..
పెద్దపల్లి: జిల్లాలోని భూ సంబంధిత సమస్యల పరిష్కారం లక్ష్యంగా యంత్రాంగం పటిష్ట చర్యలు తీ సుకుంటోంది. ఇందులో భాగంగా ఎంపికచేసిన లై సెన్స్‌డ్ సర్వేయర్లకు ఇటీవల శిక్షణ కూడా ఇచ్చింది. వీరు ఇటీవల సీఎంరేవంత్‌రెడ్డి నుంచి సర్టిఫికెట్లు అందుకున్నారు. తొలిదశలో జిల్లాకు కేటాయించిన వారిలో 68 మంది ఉన్నారు. రెండోదశలో 81మందికి సోమవారం శిక్షణ ఇచ్చారు. వీరికి త్వరలోనే నియామకపత్రాలు అందజేస్తారని తెలిసింది.
భూ సమస్యలకు పరిష్కారం..
భూ సర్వే, ఇతర సమస్యల పరిష్కారం కోసం రైతు లు దరఖాస్తు చేసి ఏళ్లు గడుస్తోంది. సర్వేయర్లు లేక సరిహద్దు సమస్యలు తీరడం లేదు. దీంతో రైతుల మధ్య వివాదాలు, ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. వీటిని పరిష్కరించే లక్ష్యంతో ప్రభుత్వం లైసెన్స్‌డ్ సర్వేయర్లను నియమిస్తోంది.
మెరుగైన సేవలు లక్ష్యం..
భూ వివాదాల పరిష్కారం, రైతులకు మెరుగైన సేవలు అందించడం లక్ష్యంగా ధరణి స్థానంలో భూభారతిని అందుబాటులోకి తీసుకొచ్చారు. అంతేకాదు.. గ్రామస్థాయిలో పాలనను చక్కదిద్దేందుకు ఇటీవల పాలనాధికారులను నియమించా రు. అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రతీరిజిస్ట్రేషన్‌కు భూపటం జతచేయడం తప్పనిసరి చేశారు. ఇందులో లైసెన్స్‌డ్ సర్వేయర్ల పాత్ర అత్యంత కీలకంగా మారింది. దీంతో వీరి నియామకంపై ప్ర భు త్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈక్రమంలోనే జిల్లాకు లైసెన్స్‌డ్ సర్వేయర్లను నియమిస్తోంది.


