గైర్హాజర్‌పై సీరియస్‌ | - | Sakshi
Sakshi News home page

గైర్హాజర్‌పై సీరియస్‌

Oct 26 2025 6:55 AM | Updated on Oct 26 2025 6:55 AM

గైర్హ

గైర్హాజర్‌పై సీరియస్‌

ఉత్పత్తి, ఉత్పాదకతపై ప్రభావం ఏడాదిలో 150 మస్టర్లు ఉండాలి లేదంటే ఉద్యోగానికి భద్రత ఉండదు ఉత్తర్వులు జారీచేసిన సింగరేణి తక్కువ మస్టర్లు నమోదైతే కౌన్సెలింగ్‌ అయినా మారకుంటే కఠిన చర్యలు

గోదావరిఖని: ఉద్యోగుల గైర్హాజర్‌పై సింగరేణి యాజమాన్యం సీరియస్‌గా ఉంది. ఏడాదిలో 150 మస్టర్ల కన్నా తక్కువ ఉంటే విచారణ ఎదుర్కొనేలా నిబంధనలు రూపొందించింది. ఈమేరకు ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. కొత్త నిబంధనల ప్రకారం.. మొత్తం ఉద్యోగుల్లో సుమారు 25శాతం వరకు గైర్హాజర్‌ అవుతున్నారని గుర్తించింది. ఇది సంస్థకు ఇబ్బందికరమని భావిస్తోంది. దీనిప్రభావం బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతపై పడుతోందని చెబుతోంది. గడిచిన మూడేళ్లతో పోల్చితే ఈ ఏడాది గైర్హాజర్‌ శాతం పెరిగిందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీర్ఘకాలికంగా విధులకు రాని ఉద్యోగులకు ఉచిత విద్యుత్‌, నీరు, వైద్యసౌకర్యాలు అందిస్తున్నా కంపెనీకి వారిసహకారం ఉండడం లేదంటోంది.

వచ్చేనెల 5వ తేదీన గుర్తింపు..

భూగర్భగనుల్లో పనిచేసే ఉద్యోగులు ప్రతీనెల 16 కన్నా తక్కువ, ఉపరితల ఉద్యోగులు 20 మస్టర్ల కన్నా తక్కువ చేస్తే వచ్చేనెల ఐదోతేదీన గుర్తించా లని సింగరేణి ఆదేశాలు జారీచేసింది. భూగర్భగను ల్లో మూడు నెలల పాటు ఇలాగే హాజరు ఉంటే గనిమేనేజర్‌ స్థాయి అధికారి, మూడునెలల తర్వాత ఏరియాస్థాయి కమిటీకి పంపించాలని ఉత్తర్వులు జారీఅయ్యాయి. గైర్హాజరై కౌన్సెలింగ్‌కు హాజరు కా కుంటే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేసింది. ఒక క్యాలెండర్‌ సంవత్సరంలో 190/ 240 కన్నా తక్కువ మస్టర్లు ఉన్న ఉద్యోగుల విచార ణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించింది.

జీఎంస్థాయి అధికారి నెలవారీ సమీక్ష

గైర్హాజర్‌ విచారణ ఎదుర్కొనే కార్మికులపై చర్యల గురించి ప్రతీనెల నిర్వహించే సమీక్షలో ఏరియాస్థాయి జీఎంలు పర్యవేక్షించాలని యాజమాన్యం సూచించింది. గైర్హాజర్‌ తగ్గించడానికి తగిన చర్యలు తీసుకోవాలని జీఎంలకు అధికారాలు కట్టబెట్టింది. ఈవిషయంలో ఏరియాల స్థాయిలో ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించవద్దని ఆదేశించింది.

150 మస్టర్లు లేకుంటే గైర్హాజరే..

ఏడాదిలో నిర్ణీత 150 మస్టర్లు లేకుంటే గైర్హాజర్‌ కార్మికుడిగా గుర్తిస్తారు. గతంలో వంద మస్టర్లు ఉండగా ప్రస్తుతం దానిని 150 మస్టర్లకు పెంచింది. 150కన్నా తక్కువ మస్టర్లు ఉన్న కార్మికుల పేర్లను ఆయాగనుల నోటీసు బోర్డులపై ప్రదర్శించాలని ఆదేశించింది. వచ్చే ఏడాది జనవరి 31నాటికి చార్జిషీట్‌, ఫిబ్రవరి–15లోగా కార్మికుల వివరణ, వివరణ సంతృప్తిగా లేకుంటే మార్చి 15నాటికి విచారణ పూర్తిచేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. కౌన్సెలింగ్‌ నిర్వహించి ఏప్రిల్‌ 30 నాటికి కౌన్సెలింగ్‌ పూర్తి చేయనున్నట్లు సింగరేణి ప్రకటించింది.

గైర్హాజర్‌పై సీరియస్‌ 1
1/1

గైర్హాజర్‌పై సీరియస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement