యూట్యూబర్‌కు గోల్డెన్ వీసా
● సన్మానించిన సదాశయ ఫౌండేషన్ బాధ్యులు
గోదావరిఖని: గోల్డెన్ వీసా సాధించిన సింగరేణి కార్మికుని కుమారుడు హఫీజ్‌ను సదాశయ ఫౌండేషన్ నిర్వాహకులు శనివారం ఘనంగా సన్మానించారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో జరిగిన కార్యక్రమంలో శాలువాతో సన్మానించి అభినందించారు. సన్మానగ్రహీత హఫీజ్ మాట్లాడుతూ, తాను 2011లో యూట్యూబ్ చానల్ ప్రారంభించానన్నారు. అప్పటినుంచి నిరంతరం కంటెంట్ ఉన్న వీడియోలను అప్‌లోడ్ చేస్తూ వస్తున్నానని తెలిపారు. 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిలో ఏర్పాటు చే సిన సోషల్ మీడియా సమ్మిట్‌లో బెస్ట్ కంటెంట్ అ వార్డు అందుకున్నట్లు వెల్లడించారు. తన వీడియో లు విదేశాల్లో సైతం ప్రాచుర్యం పొంది గోల్డెన్ కార్డు రావడం గర్వంగా ఉందన్నారు. ఈ కార్డు ద్వారా వీ సాలేకుండా 10 సంవత్చరాలపాటు తాను, తన కుటుంబ సభ్యులు యూఏఈకి వెళ్లే అవకాశం ఉందని వివరించారు. ఇది ఇప్పటివరకు సినీ హీరో లకు మాత్రమే ఉందని, యూట్యూబ్ ద్వారా తొలిసారిగా తనకే ఆ అవకాశం దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు. సమావేశంలో సదాశయ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రావణ్‌కుమార్, కె.లింగమూర్తి, సానా రామకృష్ణారెడ్డి, నూక రమేశ్, మారెల్లి రాజిరెడ్డి, చంద్రమౌళి, శంకర్, చంద్రశేఖర్, సమ్మ య్య, రాజయ్య, నరేశ్, మధు పాల్గొన్నారు.


