కార్మిక సమస్యలపై నిర్లక్ష్యం
● సీఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రాజారెడ్డి
రామగిరి(మంథని): సింగరేణి కార్మికుల ఓట్లతో గెలిచిన కార్మిక సంఘాల నాయకులు.. వారి సమస్యలను పట్టించుకోవడం లేదని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి విమర్శించారు. శనివారం ఆర్జీ–3 ఏరియాలో 10వ డివిజన్ మహాసభల సందర్భంగా బైక్‌ర్యాలీ నిర్వహించారు. అనంతరం జెండా ఆవిష్కరణ చేశారు. సింగరేణి పరిరక్షణకు సమరశీల పోరాటలు చేయాలన్నారు. నూతన గనుల తవ్వకం, పని ప్రదేశాల్లో సమస్యల పరిష్కారానికి పోరాడాలని కోరారు. నివాస ప్రాంత సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని మహాసభల్లో పలు తీర్మానాలు చేశారు. సీఐటీయూను మరింత బలోపేతం చేసి కార్మిక సమస్యల పరిష్కారంలో ముందుండాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం కుట్రలను తిప్పికోట్టాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎరవెల్లి మత్యంరావు, డి.కొమురయ్య, విజయ్ కుమార్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, కుమార్, అహ్మద్ పాషా, వేణుగోపాల్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.


