చట్టాలపై అవగాహన అవసరం | - | Sakshi
Sakshi News home page

చట్టాలపై అవగాహన అవసరం

Oct 26 2025 6:55 AM | Updated on Oct 26 2025 6:55 AM

చట్టా

చట్టాలపై అవగాహన అవసరం

పెద్దపల్లిరూరల్‌: ప్రతీపౌరుడికి మన రాజ్యాంగం హక్కులు, బాధ్యతలు కల్పించిందని, వా టిని సద్వినియోగం చేసుకునేందుకు చట్టాల పై కనీస అవగాహన ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. స్థాని క గాయత్రీ డిగ్రీ, పీజీ కాలేజీలో శనివారం జరిగిన న్యాయవిజ్ఞాన సదస్సులో న్యాయసేవాధికారసంస్థ కార్యదర్శి స్వప్నరాణితో కలిసి మా ట్లాడారు. ఉన్నత చదువుల కోసం కాలేజీలకు వెళ్లే యువత డ్రగ్స్‌, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలు కావొద్దని సూచించారు. భవిష్యత్‌ లక్ష్యం ఎంచుకుని సాకారం చేసుకునేందుకు క్రమశిక్షణతో శ్రమించాలన్నారు. లీగ ల్‌ ఎయిడ్‌ కౌన్సెల్‌ సభ్యుడు శ్రీనివాస్‌, శ్యామ ల, కరస్పాండెంట్‌ అల్లెంకి శ్రీనివాస్‌, లోక్‌అదా లత్‌ సభ్యురాలు రజనీదేవి పాల్గొన్నారు.

బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలి

పెద్దపల్లి: బ్యాంకు గ్యారంటీ ఇచ్చిన రైస్‌మిల్లులకే వానాకాలం ధాన్యం కేటాయిస్తామని సివి ల్‌ సప్లయ్‌ డీఎం శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. తన కార్యాలయంలో శనివారం రైస్‌మిల్లర్లతో సమావేశమై వానకాలంలో ధాన్యం కేటాయింపులపై సమీక్షించారు. కస్టమ్‌ మిల్లింగ్‌(సీఎమ్మార్‌) ని బంధనలను ప్రభుత్వం కఠినతరం చేసిందని తెలిపారు. సోమవారంలోగా బ్యాంకు గ్యారంటీ పత్రాలు తీసుకొచ్చి తన కార్యాలయంలో అందజేయాలని సూచించారు. తడిసిన ధా న్యం సేకరించడంతో తలెత్తే సమస్యలు పరిష్కరించాలని రైస్‌మిల్లర్లు ఆయనకు విజ్ఞప్తి చేశా రు. కార్యక్రమంలో రైస్‌మిల్లర్ల అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు నగునూరి అశోక్‌కుమార్‌, మండల అధ్యక్షుడు జైపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

రైతుల కష్టం నేలపాలు

మంథనిరూరల్‌: ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు.. చేతికందే సమయంలో చేజారిపోయేలా ఉన్నాయి. శుక్రవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి అనేక గ్రామాల్లో వరిపైరు నేలవాలింది. గుంజపడుగు, పోతారం, ఉప్పట్ల, వెంకటాపూర్‌, గోపాల్‌పూర్‌, చిన్నఓ దాల తదితర గ్రామాల్లో వరిపంట నేలపాలైందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. కోతదశకు వచ్చిన పంట వర్షార్పణం కావడంతో కన్నీటిపర్యంతమవుతున్నారు.

రక్తదానం చేయండి

సుల్తానాబాద్‌రూరల్‌: రక్తదానం ప్రాణదానంతో సమానమని పెద్దపల్లి డీసీపీ కరుణాకర్‌ అ న్నారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో శనివారం మె గా రక్తదాన శిబిరాన్ని డీసీపీ ప్రారంభించి మా ట్లాడారు. ప్రజల కోసం పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. పోలీసుల త్యాగ ఫలితా మే ప్రశాంతంగా ఉంటున్నామన్నారు. అనంతరం రక్తదానంచేసిన 220మందికి సర్టిఫికెట్లు అందజేశారు. ఏసీపీ కృష్ణ, సీఐలు సుబ్బారెడ్డి, ప్రవీణ్‌, ఎస్సైలు శ్రావణ్‌కుమార్‌, అశోక్‌రెడ్డి, వేణుగోపాల్‌, వేంకటేశ్‌, సనత్‌కుమార్‌రెడ్డి, మధుకర్‌, రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

నేడు పవర్‌ కట్‌ ప్రాంతాలు

పెద్దపల్లిరూరల్‌: జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్‌ రోడ్డులో చేపట్టిన రహదారి, డ్రైనేజీ పనుల్లో భాగంగా విద్యుత్‌ స్తంభాల మరమ్మతు కోసం ఆదివారం ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కరెంట్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ శ్రీనివాస్‌ తెలిపారు. సుభాష్‌నగర్‌, గ్యాస్‌ ఆఫీసు ఏరియా, కమాన్‌ ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నామని, వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

ఇద్దరికి జీఎంలుగా పదోన్నతి

గోదావరిఖని: ఇద్దరు సింగరేణి అధికారులకు జీఎంలుగా పదోన్నతి కల్పిస్తూ యాజమాన్యం ఆదేశాలు జారీచేసింది. ఎస్టేట్‌ అడిషనల్‌ జీ ఎం లక్ష్మీపతిగౌడ్‌కు జీఎంగా పదోన్నతి కల్పించారు. అలాగే ఎస్టీపీపీలో ఈఅండ్‌ఎం ఏజీఎంగా పనిచేస్తున్న మదన్‌మోహన్‌కు జీఎంగా ప్రమోషన్‌ కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.

చట్టాలపై అవగాహన అవసరం 1
1/2

చట్టాలపై అవగాహన అవసరం

చట్టాలపై అవగాహన అవసరం 2
2/2

చట్టాలపై అవగాహన అవసరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement