మద్యం సిండికేట్‌కు చెక్?
● దరఖాస్తుల దాఖలుకు గడువు ఈనెల 23 ● 27న డ్రా ద్వారా వైన్స్‌షాపుల కేటాయింపు
పెద్దపల్లి: మద్యం దుకాణాలకు భారీస్థాయిలో టెండర్లు దాఖలు అవుతాయని భావించినా.. అధికారుల అంచనాలు తారుమారయ్యాయి. వ్యాపారులు సిండికేట్‌గా మారి తక్కువ సంఖ్యలో దరఖాస్తులు సమర్పించారనే కారణంతో టెండర్ల స్వీకరణకు ప్రభుత్వం గడువు పొడిగించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈక్రమంలో ఈనెల 23వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మహిపాల్‌రెడ్డి ఆదివారం తెలిపారు. జిల్లాలో 74 మద్యం దుకాణాలు ఉండగా.. శనివారం అర్ధరాత్రి వరకు 1,378 దరఖాస్తులు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. గడువు ముగిశాక ఈనెల 27న లక్కీడ్రా ద్వారా మద్యం దుకాణాలు కేటాయిస్తామని ఆయన పేర్కొన్నారు.
తక్కువ దరఖాస్తులపై సమీక్ష
జిల్లాలో 74 వైన్స్‌షాపులు ఉండగా.. గతంలో 2,020 దరఖాస్తులు అందాయి. ఈసారి 1,378 మాత్రమే టెండర్లు దాఖలు కావడం, వీటిమధ్య భారీవ్యత్యాసం ఉండడంతో వ్యాపారులు సిండికేట్‌గా మారినట్లు అభిప్రాయపడుతున్నారు. అయితే, సిండికెట్‌కు చెక్ పెట్టేందుకే దరఖాస్తుల స్వీకరణ గడువును ప్రభుత్వం పొడిగించిందని అంటున్నారు. అయితే, పెద్దపల్లి సమీపంలోని బంతదంపల్లి స్వరూప గార్డెన్స్‌లో కలెక్టర్ కోయ శ్రీహర్ష సమక్షంలో ఈనెల 27న లక్కీడ్రా తీస్తారు. ఈప్రక్రియ ద్వారా వైన్స్‌షాపులు కేటాయిస్తారు. ఈప్రక్రియ మొత్తాన్ని వీడియోలో చిత్రీకరిస్తారు.
జిల్లా సమాచారం
ప్రాంతం వైన్స్ అందిన షాపులు టెండర్లు
పెద్దపల్లి 20 384
సుల్తానాబాద్ 15 283
రామగుండం 24 450
మంథని 15 261


