మంచైపె కాపలా
ఒకప్పుడు రైతులు తమ పంట కాపలా కోసం మంచె వినియోగించేవారు. పొలానికి, రైతుకు వారధిలా ఉండే మంచె.. ఎండ, వాన, చలి నుంచి కాపాడేందుకూ ఉపయోగపడేది. వన్యప్రాణులను కనిపెట్టేందు కు మంచె లేని పొలం ఉండేది కాదు. గ్రామీణ వాతావరణానికి మంచె నిలువటద్దంలా నిలిచేది. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లోని వ్యవసాయ క్షేత్రాల్లో మంచెలు కనిపిస్తున్నాయి. పల్లె వాతావరణాన్ని తలపిస్తున్నాయి. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం ఇదులాపూర్ గ్రామ శివారులోని చెరువు వద్ద చేపల కాపలా కోసం మత్స్యకారులు ఏర్పాటు చేసిన మంచె ‘సాక్షి’ కెమెరాకు ఇలా కనిపించింది.
– సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి


