‘సిమ్స్’ ప్రిన్సిపాల్‌గా నరేందర్
● హిమబిందుసింగ్‌ను తొలగిస్తూ ఉత్తర్వులు
కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖనిలోని సింగరేణి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (సిమ్స్–ప్రభుత్వ) కాలేజీ ప్రిన్సిపాల్ హిమబింద్‌సింగ్‌ను ఆ బాధ్యతల నుంచి తొలగిస్తూ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్ క్రిస్టియానా జె.చోంగ్తూ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ఇదే కాలేజీలో బయోకెమిస్ట్రీ విభాగం ప్రొఫెసర్(హెచ్‌వోడీ), వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జి.నరేందర్‌కు ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు వెలువరించారు. ఇప్పటివరకు ప్రిన్సిపాల్‌గా వ్యవహరించిన హిమబిందుసింగ్‌ను ఆ బాధ్యతల నుంచి త ప్పించడం చర్చనీయాంశమైంది. అయితే ఇదే కాలేజీలో ఖాళీగా ఉన్న పీడియాట్రిక్స్ విభాగానికి హెచ్‌వోడీగా కొనసాగాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. హిమబిందుసింగ్‌పై పలు ఆరోపణలు, ఫిర్యాదులు రావడంతోనే ప్రిన్సిపాల్ పదవి నుంచి తొలగించినట్లు కాలేజీలో ప్రచారం జరుగుతోంది.


