పరిహారం చెల్లిస్తేనే భూములిస్తాం
ముత్తారం(మంథని): పోతారం సమీపంలో చేపట్టిన గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు పనులు చేయడానికి గురువారం వెళ్లిన అధికారులు, కాంట్రాక్టర్లను నిర్వాసిత రైతులు అడ్డుకున్నారు. రెండు రోజులుగా హైవే పనులు అడ్డుకుంటున్నారు. తొమ్మిది మంది రైతులు సాగు చేసుకుంటున్న భూములకు పరిహారం చెల్లించకుండా పనులు ఎలా చేస్తారని ప్రశ్నించారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ మధూసూదన్‌రెడ్డి.. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు కోసం సేకరిస్తున్న భూములు పరిశీలించారు. పట్టాలతో ఆయన కార్యాలయానికి వెళ్లిన నిర్వాసిత రైతులతో తహసీల్దార్ మాట్లాడారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.
ఓదెలలో వర్షం
ఓదెల(పెద్దపల్లి): మండల కేంద్రంలో గురువారం హఠాత్తుగా వర్షం కురిసింది. రైతులు ఆరబోసుకున్న ధాన్యం తడిసేలోగా టార్పాలిన్ కవర్లు కప్పడంతో ప్రమాదం తప్పినట్లయ్యింది. కొనుగోళ్ల ప్రారంభంలోనే వర్షం కురవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఆకట్టుకున్న యోగా పోటీలు
గోదావరిఖనిటౌన్: ఇండియన్ యోగా ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్థానిక శ్రీరామ విద్యా నికేతన్ పాఠశాలలో గురువారం జిల్లాస్థాయి అండర్– 10, 12, 14 యోగా పోటీలు నిర్వహించారు. విజేతలు హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు మెడల్స్ అందజేశారు. యోగా అసోసియేషన్ జిల్లా కార్యదర్శి సూర్యదేవర వెంకటేశ్వరరావు, అధ్యక్షురాలు కె.కవిత, కార్యదర్శి హసీనా బేగం, టోర్నమెంట్ డైరెక్టర్ ఎ.విజయ్‌కుమార్, పీఈటీలు ఎండీ ఆసిన్, సప్నరావు, సీహెచ్ అంజలి పాల్గొన్నారు.
మెడికల్ షాపుల్లో తనిఖీలు
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని పలు మెడికల్ షాపుల్లో డ్రగ్ ఇన్‌స్పెక్టర్ శ్రవణ్‌కుమార్ గురువారం తనిఖీలు చేశారు. మూడురోజుల క్రితం ఓ మెడికల్ షాపులో పిల్లల కోసం కొనుగోలు చేసిన సిరప్ నాసిరకంగా ఉందని, కల్తీ చేశారనే అనుమానంతో బాధితుడు చిరంజీవి వైద్యాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో గురువారం మెడికల్ షాపులను తనిఖీ చేశారు. బాధితుడి వద్ద గల సిరప్ సీసా సీజ్ చేసి ల్యాబొరేటరీకి పంపించనున్నట్లు శ్రవణ్‌కుమార్ తెలిపారు. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. మెడికల్ షాపుల నుంచి మందులను కొనుగోలు చేసే వారంతా తప్పనిసరిగా బిల్లు పొందాలని సూచించారు. వినియోగదారులకు మందులతోపాటు బిల్లులు ఇవ్వాలని దుకాణ యజమానులను ఆయన ఆదేశించారు.
డీపిల్లరింగ్ ప్యానెల్ ప్రారంభం
గోదావరిఖని: సింగరేణి ఆర్జీ–1 పరిధిలోని జీడీకే–11గనిలో డీపిల్లరింగ్ సీఎం –వన్ ప్యా నెల్ సీ–టూ బీ ప్యానెల్‌ను జీఎం లలిత్‌కుమా ర్ గురువారం ప్రారంభించారు. గ్రూప్ ఏజెంట్ రాందాస్, గని మేనేజర్ మల్లేశం, సేఫ్టీ ఆఫీసర్ మల్లేశ్, ఫిట్ ఇంజినీర్ రాకేశ్ పాల్గొన్నారు.
నేటి నుంచి రైల్వేగేట్ మూసివేత
పెద్దపల్లిరూరల్: అందుగులపల్లిలోని రైల్వే లె వల్ క్రాసింగ్ గేట్ నంబరు 44ను శుక్రవారం నుంచి ఈనెల 30వ తేదీ వరకు మూసివేసి ఉంచుతామని అధికారులు తెలిపారు. ఖాజీపేట–బల్లార్ష సెక్షన్‌లోని ఈ ప్రాంతంలో అత్యవసరంగా మరమ్మలు చేపట్టడంతో గేట్ మూసివేసిఉంచుతామన్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధు లు, అధికారులు సహకరించాలని కోరారు.
పరిహారం చెల్లిస్తేనే భూములిస్తాం
పరిహారం చెల్లిస్తేనే భూములిస్తాం
పరిహారం చెల్లిస్తేనే భూములిస్తాం


