తల్లి మందలించిందని యువతి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

తల్లి మందలించిందని యువతి ఆత్మహత్య

Sep 21 2025 5:59 AM | Updated on Sep 21 2025 5:59 AM

తల్లి

తల్లి మందలించిందని యువతి ఆత్మహత్య

నాలుగు రోజుల కిత్రమే అమ్మమ్మ మృతి

పాలకుర్తి(రామగుండం): సెల్‌ఫోన్‌తో ఆడవద్దని తల్లి మందలించడంతో ఓ యువతి వ్యవసాయబావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన శనివారం పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కొత్తపల్లిలో చోటుచేసుకుంది. బసంత్‌నగర్‌ ఎస్సై స్వామి కథనం ప్రకారం.. పెద్దపల్లి మండలం కనగర్తికి చెందిన రేగుల మొండయ్య 15 ఏళ్లుగా తన అత్తగారిల్లు కొత్తపల్లిలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఆయనకు ఒక కుమారుడు రమేశ్‌, ఒక కూతురు కవిత(23) ఉన్నారు. మొండయ్య అత్త పర్శ బుగ్గమ్మ నాలుగు రోజుల క్రితం అనారోగ్యంతో మృతిచెందింది. దీంతో తన భార్య లక్ష్మితోపాటు కూతురు, కుమారుడితో కలిసి అత్తగారింటి వద్దే ఉంటున్నారు. కవిత శనివారం సెల్‌ఫోన్‌తో ఆడుతుండగా గమనించిన తల్లి.. ఇంట్లో పనిచేయకుండా ఫోన్‌తో ఆడుతున్నావా? ఒకవైపు అమ్మమ్మ చనిపోయిందనే బాధ కూడా లేదా? అని మందలించింది. కవిత కోపంతో ఇంట్లోంచి బయటకు వెళ్లిపోయింది. ఆ తర్వాత ఎంతకీ కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు ఆరాతీశారు. స్థానికుల సమాచారంతో గ్రామశివారులోని పంట పొలాల్లో వెతకగా.. ఓ వ్యవసాయబావిలో కవిత శవమై కనిపించింది. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు విగతజీవిగా మారడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వివరించారు. నాలుగు రోజుల వ్యవధిలో అమ్మమ్మ, మనుమరాలు మృతిచెందడంతో ఆ కుటుంబాల్లో విషాదం అలముకుంది.

వృద్ధురాలి..

పెద్దపల్లిరూరల్‌: పెద్దపల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన పిడుగు లచ్చమ్మ(60) శనివారం ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొంతకాలంగా మతిస్థిమితం లేక తిరుగుతోందని, శనివారం ఈ అఘాయిత్యానికి పాల్పడిందని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్‌ ఎస్సై మల్లేశ్‌ తెలిపారు.

యువ ఉద్యోగి..

యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం) : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి యైటింక్లయిన్‌కాలనీ ఎస్‌సీ టూ– 175 క్వార్టర్‌లో నివాసం ఉండే తపేట్ల పవన్‌కుమార్‌(28) శనివారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్జీ–3 ఏరియా ఏఎల్‌పీ గనిలో సీనియర్‌ మైనింగ్‌ సర్ధార్‌గా ఆయన విధులు నిర్వర్తిస్తున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. మహబూబాబాద్‌ జిల్లా మల్యాల గ్రామానికి చెందిన తపేట్ల వెంకన్నకు ఇద్దరు కుమారులు ఉన్నారు. అందులో పెద్దకుమారుడు పవన్‌కుమార్‌. సింగరేణిలో ఉద్యోగం వచ్చింది. ఆర్జీ–3 ఏరియా ఎల్‌పీ గనిలో సీనియర్‌ సర్ధార్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. పదిరోజుల క్రితం ఓ యువతిని ప్రేమించినట్లు తనకు చెప్పాడని తండ్రి వెంకన్న పేర్కొన్నారు. తన కుమారుడి మృతికి ఆ అమ్మాయి ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు సీఐ లింగమూర్తి కేసు నమోదు చేశారు. కాగా, పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులు.. పవన్‌కుమార్‌ నేత్రాలను హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్‌ ఐ బ్యాంక్‌కు దానం చేశారు.

ఉద్యోగం రాలేదని యువతి..

గంభీరావుపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం రాజుపేటకు చెందిన యువతి అల్లె ప్రియాంక ఉద్యోగం రావడం లేదనే మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడింది. ప్రియాంక ఇటీవల బీటెక్‌ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తోంది. ఉద్యోగం రాకపోవడంతో మనస్థాపానికి గురై ఉరివేసుకుంది. మృతురాలి తండ్రి రమేశ్‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అనిల్‌కుమార్‌ తెలిపారు.

తల్లి మందలించిందని   యువతి ఆత్మహత్య  
1
1/2

తల్లి మందలించిందని యువతి ఆత్మహత్య

తల్లి మందలించిందని   యువతి ఆత్మహత్య  
2
2/2

తల్లి మందలించిందని యువతి ఆత్మహత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement