
సులభంగా అప్‌లోడ్
మూగజీవాలకు మెరుగైన వైద్యాన్ని సకాలంలో అందించేందుకు ఏఐ టెక్నాలజీ ద్వారా రూపొందించిన ఆరోగ్యరేఖ యాప్ ఉపకరిస్తుంది. పశువు ఫొటో తీసి అప్‌లోడ్ చేస్తే వ్యాధి వివరాలు, నివారణ చర్యలు, సమీపంలోని పశువైద్యాధికారి సెల్ నంబరు సహా పూర్తిసమాచారం వస్తుంది.
– కుమార్, గోపాలమిత్ర, రామగిరి
అవగాహన కల్పిస్తాం
రాష్ట్రంలోనే తొలిసారి మంత్రి శ్రీధర్‌బాబు, కలెక్టర్ శ్రీహర్ష చొరవ చూపడంతోనే ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టాం. సత్ఫలితాలు రావడంతో జిల్లా వ్యాప్తంగా అమలు చేసేందుకు నిర్ణయించాం. పాడిరైతుల్లో అవగాహన కల్పిస్తాం.
– విజయభాస్కర్,
జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి
పాడిరైతుకు మేలు
పశువులకు వ్యాధి వస్తే పాడిరైతుకు వ్యయ, ప్రయాసలు లేకుండా మెరుగైన వైద్యసేవలు సకాలంలో అందించాలన్నదే లక్ష్యం. ఎదకొచ్చిన పశువులకు మేలుజాతి పశువులు ఉత్పత్తి అయ్యేలా కృత్రిమ గర్భాధారణ చేసేందుకూ అవకాశం ఉంది. ఏఐ వినియోగంపై విస్తృత ప్రచారం కల్పించాలి.
– కోయ శ్రీహర్ష, కలెక్టర్

సులభంగా అప్‌లోడ్

సులభంగా అప్‌లోడ్