
యాగంలో పీఠాధిపతులు
గోదావరిఖనిటౌన్: రాష్ట్రీయ సాధు సంరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు తుడి శ్రావణ్‌కుమార్ ఆధ్వర్యంలో స్థానిక సత్యసాయి మందిరంలో రెండోరోజు మంగళవారం మహాసుదర్శన యాగం, కుంకుమార్చన నిర్వహించారు. కేదారనాథ్ క్షేత్ర పీఠాధిపతి రుద్రస్వామితోపాటు పీఠాధిపతులు అంబికేశ్వరాస్వామి, కరుణనందగిరిస్వామి, కల్యాణనంద భారతీస్వామి, రాఘవేంద్రస్వామి, త్రిశక్తి షణ్ముఖస్వామి, మాతా మహేశ్వరిదేవిజీ, శివ ప్రియానందస్వామి, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
రైల్వే స్టేషన్‌లో తనిఖీలు
రామగుండం: స్థానిక రైల్వేస్టేషన్‌లో మంగళవారం డాగ్‌స్క్వాడ్‌తో సోదాలు చేశారు. య శ్వంత్‌పూర్–గోరఖ్‌పూర్ వెళ్తున్న రైలు ప్లాట్‌ఫారంపై నిలిచి ఉన్న సమయంలో క్షుణ్ణంగా తని ఖీ చేశారు. సంఘ విద్రోహక శక్తులు రైళ్లు టార్గెట్‌గా విధ్వంసాలకు పాల్పడే అవకాశం ఉందనే కేంద్ర నిఘా సంస్థ ఆదేశాల మేరకు ఆకస్మికంగా సోదాలు చేశారు.
స్థానికులకే అవకాశం ఇవ్వాలి
జ్యోతినగర్(రామగుండం): స్థానిక లారీలకే ర వాణా అవకాశం కల్పించాలని గోదావరిఖని లారీ యజమానులు కోరారు. ఈమేరకు ఎన్టీపీ సీ ప్రాజెక్టు లేబర్ గేట్ వద్ద మంగళవారం నిరసన తెలిపారు. లోడ్‌తో వచ్చే స్థానికేతర లారీ లను నిలిపివేశారు. చాలామంది నిరుద్యోగులు ఉపాధి కోసం లారీలు కొనుగోలు చేశారని, స్థా నికేతర లారీలతో స్థానికులకు లోడింగ్ సౌక ర్యం ఉండడంలేదు, తద్వారా ఆర్థిక ఇబ్బందు లు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశా రు. అధికారులు జోక్యం చేసుకోవాలని వారు కోరారు. లారీ యజమానుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాసరెడ్డి, దామోదర్‌రెడ్డి. బాపన్న తదితరులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారంపై దృష్టి
యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): కార్మికుల సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తున్నామని బీఎంఎస్ రాష్ట్ర అద్యక్షుడు యాదగిరి సత్తయ్య అన్నారు. స్థానిక యూనియన్ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీఎంఎస్ ఆవిర్భవించి 70 ఏళ్లు పూర్తికావొస్తున్నందున ఈనెల 23న బొగ్గు గనులు, డిపార్ట్‌మెంట్లు, యూనియన్ కార్యాలయాల్లో వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు. నాయకులు సారంగపాణి, వేణుగోపాల్‌రావు, వడ్డెపల్లి కుమారస్వామి, గట్టు శ్రీనివాస్, రవీందర్, లింగం నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఓపీ రిజిస్ట్రేషన్‌కు ప్రత్యేక షెడ్డు
కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖని ప్రభు త్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లో ఓపీ రిజిస్ట్రే షన్ కౌంటర్ల వద్ద పేషెంట్ల రద్దీని అధిగమించ డానికి కలెక్టర్ ఆదేశాలతో అధికారులు చర్యలు చేపట్టారు. ఒకేచోట ఓపీ రిజిస్ట్రేషన్ చేసేలా రేకులతో షెడ్డు నిర్మిస్తున్నారు. ఈ పనులను వేగవంతంగా పూర్తి చేయడానికి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
రేపు సికింద్రాబాద్‌లో జాబ్‌మేళా
పెద్దపల్లిరూరల్: జిల్లాలోని విద్యావంతులైన నిరుద్యోగ యువకులకు ఈనెల 24న (గురువారం) సికింద్రాబాద్‌లో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి తిరుపతిరావు తెలిపారు. సీతారామ స్పిన్నర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో కోర్‌స్పిన్ యార్న్ తయారీ చేస్తోందని, విస్తరణలో భాగంగా 300 పోస్టులను భర్తీ చేస్తారని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు సికింద్రాబాద్‌లోని మినర్వాకాంప్లెక్స్ ఆరోఅంతస్తు ఆఫీసు నంబరు 608లో తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. వివరాలకు 90631 73935, 73374 59857 నంబర్లలో సంప్రదించాలని ఆయన సూచించారు.

యాగంలో పీఠాధిపతులు

యాగంలో పీఠాధిపతులు

యాగంలో పీఠాధిపతులు