
● అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ● ఎమ్మెల్యే విజయరమణారావు
పెద్దపల్లిరూరల్: నియోజకవర్గంలోని అన్ని పల్లె ల్లో ప్రజలకు కనీస మౌలిక వసతులను కల్పించ డం లక్ష్యమని ఎమ్మెల్యే విజయరమణారావు అ న్నారు. పెద్దపల్లి మండలం మూలసాలలో రూ. 59లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన పనులను ఆయన సోమవారం ప్రారంభించి మాట్లాడారు. పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్ ప్రజాసంక్షేమాన్ని వి స్మరించిందని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలోని ప్రజాప్రభుత్వం అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు పంపిణీ చేయడంతోపాటు రేషన్‌కార్డులు జారీ చేస్తోందని తెలిపారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ ఈర్ల స్వరూప, నాయకులు వెంకటేశ్, శ్రీనివాస్, ఆరె సంతోష్, రాజేందర్, ముత్యాల నరేశ్, శంకర్, కొమురయ్య, అశోక్, రవి తదితరులు పాల్గొన్నారు.
రూ.200 కోట్లతో అభివృద్ధి పనులు
ఓదెల(పెద్దపల్లి): వివిధ గ్రామాల్లో రూ.200 కో ట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని ఎమ్మెల్యే విజయరమణరావు అన్నా రు. మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశాక మాట్లాడారు. అంగన్‌వాడీ కేంద్రాలకు సొంతభవనాలు నిర్మించేందుకు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఓదెల మల్లికార్జునస్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. నాయకులు మూల ప్రేంసాగర్‌రెడ్డి, ఆళ్ల సుమన్‌రెడ్డి, బైరి రవిగౌడ్, సిరిశేటి రాహుల్‌గౌడ్, పిట్టల రవికుమార్, చీకట్ల మొండయ్య, గుండేటి మధు యాదవ్, ఎంపీడీవో తిరుపతి, ఆలయ ఈవో సదయ్య పాల్గొన్నారు.