
పాఠశాలకే క్రీడామైదానం బోర్డు
వేములవాడరూరల్: క్రీడా మైదానాలను ఏర్పాటు చేసిన గత ప్రభుత్వం వాటికోసం కేటాయించిన నిధులు వృథా అయ్యాయి. ప్రతి గ్రామానికి క్రీడామైదానం, ఓపెన్ జిమ్, పా ర్కులు ఏర్పాటు చేసింది. చాలా గ్రామాల్లో ఇవి బోర్డుల వరకే పరిమితమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్రీడా మైదానాలు పాఠశాలలకే బోర్డులు పెట్టి అధికారులు చేతులు దులుపుకున్నారు. అక్కడ ఎలాంటి పరికరాలు ఉన్న దాఖలాలు లేవు. ఇక గ్రామానికో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయగా అందులోని పరికరాలు తుప్పుపట్టిపోతున్నా యి. అధికారులు దృష్టిసారించి వినియోగంలోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు.