
11 ఏళ్లుగా ఇబ్బంది
పాఠశాలలో 11 ఏళ్లుగా వంట వండుతున్న. ఇప్పటివరకు కట్టెల పొయ్యిపైనే వంటలు చేస్తూ ఇబ్బంది పడుతున్న. గ్యాస్ సిలిండర్లు ఇస్తమన్నరు కానీ ఇంకా ఇయ్యలే. వానాకాలంల బాగా తిప్పలు అయితాంది. కట్టెలు కూడా దొరుకుతలేవు. – అవునూరి లక్ష్మి,
నిర్వాహకురాలు, భీంరాంపేట
గ్యాస్ కొంటున్నం
కట్టెలు దొరకడంలేదు. గ్యాస్ సిలిండర్ నేనే కొంటున్న. ఒక్కో సిలిండర్ రెండు నెలలు వస్తాంది. పైసలు మాపైనే పడుతున్నయి. గ్యాస్ కనెక్షన్ ఇస్తే కొంచెం భారం తగ్గుతది.
– గుమ్మడి వసంత,
నిర్వాహకురాలు, చిల్లపల్లి
వివరాలు సేకరిస్తున్నాం
ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కడెక్కడ వంటగ్యాస్ సిలిండర్లు అవసరమనే వివరాలు సేకరిస్తున్నాం. గతంలోనూ ప్రభుత్వానికి నివేదిక పంపించాం. ప్రస్తుతం చాలా స్కూళ్లలో మధ్యాహ్న భోజనం కట్టెల పొయ్యిలపైనే తయారు చేస్తున్నారు. ఒకట్రెండురోజుల్లో డాటా సేకరణ పూర్తవుతుంది. ఆ వెంటనే ఉన్నతాధికారులకు నివేదిస్తాం.
– లక్ష్మి, మండల విద్యాధికారి, మంథని

11 ఏళ్లుగా ఇబ్బంది