
గురువారం శ్రీ 17 శ్రీ జూలై శ్రీ 2025
ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు ఖరారు
పెద్దపల్లిరూరల్: జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను ఖరారు చేస్తూ ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. జిల్లాలో ప్రస్తుతం 13 జెడ్పీటీసీ, 140 ఎంపీటీసీ స్థానాలు ఉన్నా యి. తాజాగా మూడు ఎంపీటీసీ స్థానాలు తగ్గించి 137కే పరిమితం చేశారు. ఇందులో వెంకట్రా వుపల్లి, లింగాపూర్ పంచాయతీలు రామగుండం కార్పొరేషన్‌లో విలీనం కాగా, పెద్దంపేట(రామగిరి మండలం) గ్రామాన్ని జల్లారం ఎంపీటీసీ స్థానం పరిధిలో విలీనం చేశారు. దీంతో ఎంపీటీసీల స్థానాల సంఖ్య 137కే పరిమితమైందని, జెడ్పీటీసీ స్థానాల్లో మార్పేమీలేదని జెడ్పీ సీఈవో నరేందర్ వివరించారు.
ఆటో.. సామర్థ్యానికి మించి..
‘ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలి.. అతివేగం వద్దు.. సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించరాదు.. సౌండ్‌సిస్టమ్ అసలే వాడొద్దు.. మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్ద’ని సంబంధిత శాఖ అధికారులు జిల్లావ్యాప్తంగా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఇదేసమయంలో విద్యార్థులను తరలించే పాఠశాలల బస్సులు, ఆటోల డ్రైవర్లు, యజమానులకూ వివరిస్తూనే ఉన్నారు. అయినా, నిబంధనలు ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు. సామర్థ్యానికి మించి, నిబంధనలు అతిక్రమిస్తూ ఆటోల్లో చిన్నారులను ఇంటి నుంచి బడికి, బడి నుంచి ఇంటికి తరలిస్తూనే ఉన్నారు. గ్రామాల్లో అయితే, ప్రమాదాల సంఖ్య తక్కువగా ఉంటున్నా.. మెయిన్ రోడ్లు, రాష్ట్ర రహదారిపై ఇలాంటి ఆటోలు రాకపోకలు సాగిస్తూనే ఉన్నాయి. ఇందుకు నిదర్శనమే జిల్లా కేంద్రంలో ‘సాక్షి’ కెమెరాకు చిక్కిన ఈ చిత్రాలు.. అధికారులు ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే..
– సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి
న్యూస్‌రీల్

గురువారం శ్రీ 17 శ్రీ జూలై శ్రీ 2025

గురువారం శ్రీ 17 శ్రీ జూలై శ్రీ 2025

గురువారం శ్రీ 17 శ్రీ జూలై శ్రీ 2025

గురువారం శ్రీ 17 శ్రీ జూలై శ్రీ 2025

గురువారం శ్రీ 17 శ్రీ జూలై శ్రీ 2025