అభివృద్ధే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధే లక్ష్యం

Jul 17 2025 3:15 AM | Updated on Jul 17 2025 3:15 AM

అభివృ

అభివృద్ధే లక్ష్యం

పెద్దపల్లి ప్రగతిపై ప్రత్యేక దృష్టి

పామాయిల్‌ పంటను ప్రోత్సహించాలి

మంత్రులు తుమ్మల, సీతక్క, శ్రీధర్‌బాబు

పెద్దపల్లిరూరల్‌: పెద్దపల్లి అభివృద్ధికి సంపూర్ణ సహ కారం అందిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలో ని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ మైదానంలో బుధవా రం స్థానిక ఎమ్మెల్యే విజయరమణారావు అధ్యక్షత న ఏర్పాటు చేసిన నియోజకవర్గస్థాయి ఇందిరా మ హిళాశక్తి సంబురాల్లో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బా బు, సీతక్క, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌, కలెక్టర్‌ కోయ శ్రీహర్ష తదితరులతో కలిసి మంత్రి పాల్గొన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి తపిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండే విజ యరమణారావును ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం మీ అదృష్ణమన్నారు. మంచి ఆదాయాన్నిచ్చే ఆయిల్‌పామ్‌ సాగును ప్రోత్సహించాలని ఆయన సూచించారు. కోతులు, పందులే కాదు దేనితోనూ నష్టం జరగని పంట పామాయిల్‌ అని, ఈ పంట సాగుచేసే రైతులకు రాయితీ వర్తింపజేస్తున్నామని తుమ్మల తెలిపారు. కేంద్రప్రభుత్వం దిగుబడి ధర తగ్గించేందుకు కుట్ర పన్నితే పెంచేలా ఒత్తిడి తెస్తున్నామన్నారు. కాల్వశ్రీరాంపూర్‌లో ఆయిల్‌పామ్‌ పరిశ్రమ నిర్మిస్తున్నామన్నారు. కొద్దిరోజుల్లోనే సిద్దిపేట సమీపంలోనూ ఫ్యాక్టరీని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారని వివరించారు.

‘మార్పు’ చూపిస్తున్నాం

పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనతో విసుగు చెందిన ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం అప్పగిస్తే.. సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం అన్నివర్గాల వారిలో మార్పు తెచ్చి చూపించిందని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నామని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే విజ్జన్న అభ్యర్థన మేరకే మహిళల్లో నైపు ణ్యాన్ని పెంచేలా శిక్షణను ఇచ్చేందుకు పెద్దపల్లిలో వీ–హబ్‌ ఏర్పాటు చేస్తున్నామని ఆయ న పేర్కొన్నారు. వచ్చేనెలలో ఈ సెంటర్‌ను ప్రారంభిస్తామని శ్రీధర్‌బాబు తెలిపారు.

మహిళాసాధికారతే లక్ష్యం.. మంత్రి సీతక్క

మహిళా సాధికారిత లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి సీతక్క అన్నారు. రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు సైతం మహిళల పేరిట మంజూరు చేస్తున్నా మని తెలిపారు. రుణ వాయిలను సకాలంలో చెల్లిస్తుండడంతో మహిళాసంఘాలకే మళ్లీ రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ముందుకొస్తున్నారని సీతక్క వివరించారు. తెలంగాణ మహిళల శక్తియుక్తులను ప్రధాని నరేంద్రమోదీ సైతం ప్రశంసించారని ఆమె గుర్తుచేశారు.

మహిళల్ని ప్రోత్సహిస్తున్న సర్కార్‌

మహిళలు ఆర్థికంగా ఎదిగేలా ప్రభుత్వం అన్నిరంగాల్లో ప్రాధాన్యతనిస్తోందని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ అన్నారు. కలెక్టర్‌ కోయశ్రీహర్షతో పాటు అడిషనల్‌ కలెక్టర్లు అరుణశ్రీ, వేణు, ఆర్డీవోలు గంగయ్య, సురేశ్‌, జెడ్పీ సీఈవో నరేందర్‌, డీపీవో వీరబుచ్చయ్య, డీఆర్డీవో కాళిందిని, డిఎంహెచ్‌వో అన్న ప్రసన్నకుమారి, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

బతుకమ్మ పండుగ కానుకగా ఆడబిడ్డలకు ప్రభుత్వం అందించే చీరలు నాణ్యంగా ఉండేలా చూడాలని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు మంత్రి సీతక్కను అభ్యర్థించారు. బీఆర్‌ఎస్‌ పాలకులు పంపిణీ చేసిన చీరలను పంట చేలకు రక్షణగా, ఇంటి పనుల వద్ద వాడుకున్నారని గుర్తుచేశారు. నియోజకవర్గంలోని 4,521 మహిళా సంఘాలకు రూ.4కోట్ల94లక్షల వడ్డీలేని రుణాలను పంపిణీ చేశామని, సీ్త్రనిధి ద్వారా 514 సంఘాలకు రూ.11కోట్ల75లక్షలు అందించామని తెలిపారు. పెద్దపల్లి, ఎలిగేడు, జూలపల్లి, ఓదెల, సుల్తానాబాద్‌ మండల సమాఖ్యలకు బస్సులు అందించామన్నారు.

అభివృద్ధే లక్ష్యం 1
1/3

అభివృద్ధే లక్ష్యం

అభివృద్ధే లక్ష్యం 2
2/3

అభివృద్ధే లక్ష్యం

అభివృద్ధే లక్ష్యం 3
3/3

అభివృద్ధే లక్ష్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement