
ఇసుక లోడింగ్ లొల్లి
● ఆందోళనకు దిగుతున్న లారీ డ్రైవర్లు ● పెద్దఎత్తున డబ్బులు చేతులు మారుతున్నట్లు ఆరోపణలు ● రహదారికి ఇరువైపులా లారీల పార్కింగ్‌తో ట్రాఫిక్ సమస్య
మంథని: ఇసుక క్వారీల్లో లోడింగ్ వివాదాస్పదమవుతోంది. దూర ప్రాంతాల నుంచి ఇసుక తీసుకెళ్లేందుకు వస్తున్న లారీల్లో లోడింగ్ ఆలస్యమవుతోందని, స్థానికులు, డబ్బులు ఇచ్చిన వారి లారీల్లోనే ఇసుక లోడ్ చేస్తున్నారని లారీ డ్రైవర్లు ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈనెల 13న మంథని మండలం అడవిసోమన్‌పల్లి ఇసుక క్వారీ వద్ద లోడ్ చేసుకునేందుకు వచ్చిన లారీ డ్రైవర్లు మంథని – కాటారం మెయిన్ రోడ్డుపై రాస్తారోకో చేశారు. అలాగే నాలుగు రోజుల క్రితం నియోజకవర్గంలోని బెగ్లూర్ ఇసు క క్వారీ వద్ద ఇదే పరిస్థితి నెలకొందని డ్రైవర్లు ఆందోళనకు దిగారు. బుధవారం కూడా ముత్తా రం మండలం ఖమ్మంపల్లి ఇసుక క్వారీ వద్ద డ్రైవర్లు ధర్నా చేశారు. రోజుల తరబడి పడిగాపు లు కాస్తున్నామని, డబ్బులు ఇచ్చిన వారికే ఇసుక లోడ్ చేస్తున్నారని వారు ఆవేదన చెందారు.
సౌకర్యాలు లేక అవస్థలు..
వందల కిలో మీటర్ల దూరం నుంచి ఇసుక తీసు కు వెళ్లేందుకు మానేరు తీరంలోని క్వారీ వద్దకు వస్తున్న లారీ డ్రైవర్లు తమ వాహనంలో లోడ్ చే సుకునేందుకు నాలుగు నుంచి ఐదు రోజల పా టు పడిగాపులు కాస్తున్నారు. అయినా, క్వారీల వద్ద కనీస సౌకర్యాలు లేకపోవడంతో రాత్రి, పగలు చెట్లనీడ నిరీక్షించాల్సి వస్తోందని డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ బాధను ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.
రోడ్డుకు ఇరువైపులా లారీల బారులు..
ఇసుక లోడింగ్‌కు ఆలస్యమవుతుండడంతో ప్రధాన రహదారికి ఇరువైపులా లారీలను పార్కి ంగ్ చేస్తున్నారు. కిలో మీటర్ల మేర పెద్దఎత్తున లారీలు రోడ్డుకు ఇరువైపులా ఇలా నిలపడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. అలాగే రాత్రివేళ లో వచ్చేవాహనాలతో ప్రమాదాలు జరిగే ఆస్కా రం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. వివాదాలకు కారణవుతున్న అధికారులపై దృష్టి సారించి ఉన్నతాధికారులు సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని పలువురు కోరుతున్నారు.
మళ్లీ రోడ్డెక్కిన లారీ డ్రైవర్లు
ముత్తారం(మంథని): ఖమ్మంపల్లి – తాడిచర్ల మా నేరు బ్లాక్–2 క్వారీలో తమ లారీల్లో ఇసుక నింపడం లేదని ఆరోపిస్తూ పలువురు డ్రైవర్లు బుధవారం మరోసారి ధర్నా చేశారు. ఇదే సమస్యపై ఇటీవలకే వారు ఆందోళనకు దిగారు. నిబంధనల ప్రకారం డీడీ చెల్లించి ఇసుక క్వారీ వద్ద వారం రోజులుగా నిరీక్షిస్తున్నా నిర్వాహకులు పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వానికి రుసుం చెల్లించకుండా వచ్చే ఒక్కోలారీకి రూ.4,700 తీసుకుంటూ ఇసుక నింపుతున్నారని వారు ఆరోపించారు. రోజుల తరబడి నిరీక్షిస్తూ, ఆకలికి అలమటిస్తున్నా తమ మొర ఎవరూ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అధికారుల సహకారంతోనే క్వారీ నిర్వాహకులు, సూపర్‌వైజర్లు కుమ్మకై ్క ప్రభుత్వ ఇసుకను అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ఈ అక్రమాలపై విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు.