
సమన్వయంతో పరిష్కారం
పెద్దపల్లిరూరల్: జిల్లాలో తలెత్తే విద్యుత్ సమస్యలను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పరిష్కరించుకోవాలని కలెక్టర్ కో య శ్రీహర్ష ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీతో కలిసి బుధవారం తన కార్యాలయంలో ఆయన విద్యుత్ తదితర సమస్య లు, వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. కొత్తగా వేసే విద్యుత్ లైన్లు ట్రాన్స్‌ఫార్మర్లు రోడ్లపైకి రాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. రోడ్డు విస్తరణ, మురు గునీటి కాలువల నిర్మాణ సమయంలో అవసరమైతే విద్యుత్ స్తంభాలు మార్చాలని అన్నా రు. అదేవిధంగా భూసంబంధ సమస్యలపై అందిన అర్జీలను ఈ నెలాఖరు వరకు పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. భూభారతి –రెవెన్యూ సదస్సుల్లో అందిన దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలని అన్నారు. వి ద్యుత్ ఎస్‌ఈ గంగాధర్, డీపీవో వీరబుచ్చయ్య, మున్సిపల్ కమిషనర్లు వెంకటేశ్, రమేశ్, వెంకన్న, ఆర్డీవోలు గంగయ్య, సురేశ్, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
26న ఇందిరాశక్తి వేడుకలు
రామగుండం: అంతర్గాం మండల కేంద్రంలో ఈనెల 26న నిర్వహించే ఇందిరా మహిళాశక్తి సంబురాలకు రాష్ట్ర మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు హాజరుకానున్నారని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ఠాకూర్ తెలిపారు. ఈ మేరకు బుధవారం సభా ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. సభకు మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చేలా చర్యలు చేపట్టాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి పెండ్రు హన్మాన్‌రెడ్డి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెండ్యాల మహేశ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మడ్డి తిరుపతిగౌడ్, ప్రతినిధులు ఉరిమెట్ల రాజలింగం, సింగం కిరణ్‌కుమార్‌గౌడ్, జూల లింగయ్య తదితరులు పాల్గొన్నారు.
19న అథ్లెటిక్స్ పోటీలు
జ్యోతినగర్(రామగుండం): రామగుండం జె డ్పీ హైస్కూల్ క్రీడా మైదానంలో ఈనెల 19న జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహిస్తామని అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాస్, గట్టయ్య తెలిపారు. పోటీల్లో పాల్గొనాలనుకునే వారు పూర్తి వివరాల కోసం పీఈటీ అజయ్, 99595 24375 నంబరులతో సంప్రదించాలని వారు సూచించారు.