
బోనమెత్తి.. నృత్యం చేసి..
కోల్‌సిటీ(రామగుండం): రజకుల ఆరాధ్య దైవమైన మడేలేశ్వరస్వామి బోనాల జాతర గోదావరిఖనిలో బుధవారం ఘనంగా జరుపుకున్నారు. స్థానిక ఎల్బీనగర్ రజక సంఘం ఆధ్వర్యంలో మహిళలు ఇంటింటా బోనం తీసుకుని డప్పు చప్పుళ్లు, శివశత్తుల నృత్యాలతో ఊరేగింపు నిర్వహించారు. అడ్డగుంటపల్లిలోని మడేలేశ్వరస్వామి ఆలయానికి చేరుకున్నారు. స్వామివారికి నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. నాయకులు కొండపర్తి సంజీవ్, మామిడి పోశం, బొడ్డుపెల్లి రంజిత్, మామిడి రమేశ్, గూడెపు రామచందర్, మామిడి రాజయ్య, పూసాల రాజయ్య, కొత్తపెల్లి శంకర్, పున్నం సారయ్య, మామిడి కుమార్, మామిడి మహేందర్, మామిడి అశోక్, పూసాల శ్రీనివాస్, పూసాల శీను తదితరులు పాల్గొన్నారు.

బోనమెత్తి.. నృత్యం చేసి..