
మహిళలకు ఏంచేశారని సంబురాలు?
● కేసీఆర్‌పై కోపంతోనే గోస పెడుతున్నారా? ● రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువు ● మాజీ ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, టీఎస్టీఎస్ మాజీ చైర్మన్ రాకేశ్
పెద్దపల్లిరూరల్: కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి ఏంచేసిందని పెద్దపల్లిలో పెద్దఎత్తు న సంబురాలు జరుపుకున్నారో చెప్పాలని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి నిలదీశారు. ము గ్గురు మంత్రులు వేడుకలకు హాజరయ్యారే తప్ప మహిళలు, రైతుల కోసం ఏం చేశారో చెప్పనే లే దన్నారు. జిల్లా కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎంతమంది మహిళలకు రూ.2500 ఇస్తున్నారు, సబ్సిడీగ్యాస్, విద్యు త్ బిల్లుల మాఫీ లాంటి పథకాలను ఎంతమందికి వర్తింపజేసారో శ్వేతపత్రం విడుదల చేయా లని డిమాండ్ చేశారు. జిల్లాకు నాలుగు ఠాణాలు మంజూరు చేసినా శాంతిభద్రతలను కాపాడడంలో పోలీసు యంత్రాంగం విఫలమైందని టీఎస్టీఎస్ మాజీ చైర్మన్ చిరుమిల్ల రాకేశ్ విమర్శించా రు. సాగునీటిపై మంత్రులను ప్రశ్నిస్తారనే భ యంతోనే రైతులను ముందస్తుగా అరెస్టు చేశా రని ధ్వజమెత్తారు. డీసీపీ ఆఫీసు సమీపంలోనే కత్తుల దాడుల్లో ఇద్దరిని హతమార్చిన ఘటన జరిగి గంటలు కూడా కాలేదని తెలిపారు. చెరువుల్లోకి కాళేశ్వరం నీటిని మళ్లించాలని డిమాండ్ చేశారు. నాయకులు ఉప్పు రాజ్‌కుమార్, శ్రీధర్, చంద్రశేఖర్, వెంకటేశ్, రాజు, ఫహీం, సరేశ్, శివకుమార్, రవి, కుమార్, మనోజ్, శ్రీనివాస్, కిరణ్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.