
చెట్టు కూలి కొంగలు విలవిల
కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖని అడ్డగుంటపల్లి ప్రధాన రహదారిలోని భారీచింతచెట్టు బుధవారం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నరికివేయించారు. రహదారి విస్తరణలో భాగంగా దానిని తొలిగించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే.. ఈ చెట్టుపై సేదతీరుతున్న కొంగలు, మరికొన్ని పక్షులు రాత్రి వరకూ కొమ్మలపైనే ఉండిపోయాయి. కొన్ని పక్షులు అదుపుతప్పి చెట్టు కిందపడడంతో మరణించాయి. రోడ్ల విస్తరణకు అడ్డుగా ఉన్నచెట్ల తొలగింపు అనివార్యం అయినప్పటికీ నీడనిచ్చే భారీ చెట్లు నెలకూలడంపై పర్యావరణ ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చెట్టు కూలి కొంగలు విలవిల