
ఎరువులు కేటాయించాలి
గోదావరిఖని/ ఫెర్టిలైజర్‌సిటీ: రాష్ట్రానికి ప్రత్యేకంగా ఎరువులు కేటాయించాలని ఎంపీ వంశీకృష్ణ కోరారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర ఎరువుల శాఖ కార్యదర్శి రాజత్‌మిశ్రాను కలిసి వినతిపత్రం అందజేశారు. తెలంగాణకు 2.7లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు సరఫరా చేస్తామని కేంద్ర ఎరువుల శాఖ కార్యదర్శి హామీ ఇచ్చిన ట్లు ఎంపీ వంశీకృష్ణ వివరించారు.
నేడు నీటి సరఫరా బంద్
పెద్దపల్లిరూరల్/కోల్‌సిటీ: జిల్లాలో బుధవారం మిషన్ భగీరథ నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని గ్రిడ్ ఈఈ పూర్ణచందర్ తెలి పారు. ముర్మూర్ ఇంటెక్‌వాల్, పంప్‌హౌస్‌లో మిషన్‌భగీరథ పంపులు, బఫర్ పైపులైన్ మరమ్మతులతో అంతరాయం ఏర్పడుతుందని వివరించారు. పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీలు, రామగుండం కార్పొరేషన్ పరిధితోపాటు జిల్లావ్యాప్తంగా తాగునీటి సరఫరా ఉండదని ఆయన వివరించారు.