
కూరగాయల దుకాణాలు బంద్
● రహదారులపై విక్రయాలు ● ఆంక్షలు విధించిన అధికారులు ● షాపుల్లోకి వెళ్లాలని బల్దియా యంత్రాంగం ఆదేశాలు
కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖనిలోని కూ రగాయల మార్కెట్‌లో రిటెయిల్ వ్యాపారులు సోమవారం దుకాణాలు మూసివేశారు. మార్కె ట్ భవన సముదాయంలోని రోడ్లపై కూరగాయ లు విక్రయించడంపై బల్దియా అధికారులు అ భ్యంతరం వ్యక్తం చేశారు. వ్యాపారులకు కేటా యించిన దుకాణాల్లోనే విక్రయించాలని వారు ఆదేశించారు. దీంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. షాపులు అనుకూలంగా లేకనే నగరంలోని ప్రధాన రహదారుల పక్కన కూరగాయలు విక్రయిస్తుండడంతో వినియోగదారులు మార్కెట్‌కు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశా రు. కాగా, చికెన్, మటన్ షాపులతోపాటు చేపల విక్రయ వ్యాపారులు కూడా వారికి కేటాయించిన షాపుల్లోనే విక్రయాలు జరపాలని అధికారులు ఆదేశించారు. కేటాయించిన షాపుల్లో కాకుండా, మార్కెట్ భవనంలోని రోడ్లను ఆక్రమించుకొని ఏళ్లుగా విక్రయాలు చేయడంపై బల్దియా అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. ఈ నేపథ్యంలోనే సోమవారం అధికారులు కఠిన ఆదేశాలు జారీచేశారు. ఇందుకు నిరసనగా వ్యాపారులు ఒకరోజు బంద్ పాటించారు. తమ నష్టం వాటిల్లకుండా చూడాలని వ్యాపారులు కోరుతున్నారు.