
పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ
● కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశం ● బల్దియా అధికారులతో సమీక్ష ● క్షేత్రస్థాయిలో పర్యటన
కోల్‌సిటీ(రామగుండం): రామగుండం నగరంలో పారిశుధ్య లోపం తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించా రు. బల్దియా కమిషనర్(ఎఫ్‌ఏసీ) అరుణశ్రీతో కలిసి శుక్రవారం ఆయన మార్కెట్ ఏరియా, కల్యాణ్‌నగర్‌లో విద్యుత్ లైన్, ఊర్వశి థియేటర్ సమీప నాలా, సిరి ఫంక్షన్‌హాల్ సమీపంలో యూజీడీ పనులతోపాటు నాలాల్లో పూడికతీత, మార్కండేయ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణాన్ని ఆయన పరిశీలించారు. అంతకుముందు శానిటేషన్, ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ అధికారుతో వివిధ పనులపై సమీక్షించారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో డి ప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, ఎస్‌ఈ శివానంద్, ఈఈ రామన్ తదితరులు పాల్గొన్నారు.
నాణ్యత ప్రమాణాలు పాటించాలి
జ్యోతినగర్(రామగుండం): రోడ్డు పనుల్లో నాణ్య త ప్రమాణాలు పాటించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. ఎన్టీపీసీ రాజీవ్ రహదారి నుంచి నర్రాశాలపల్లె వరకు 24 అడుగుల వెడల్పుతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను శుక్రవారం కలెక్టర్ పరిశీలించారు. రూ.రెండు కోట్ల వ్యయంతో రోడ్డు నిర్మాణం చేపట్టామన్నారు. ఎన్టీపీసీ సోలార్ ప్లాంట్‌ను ఆనుకుని ఉన్న గోడ సమీపం నుంచి రోడ్డు నిర్మించాలని ఆయన సూచించారు. అధికారులు శివానంద్, రామన్, కాంట్రాక్టర్ మాచిరి మహేందర్‌గౌడ్, కాంగ్రెస్ పట్టణ కమిటీ అధ్యక్షుడు ఆసిఫ్ పాషా, డీసీసీ కార్యదర్శి మొహమ్మద్ రహీమ్ తదితరులు పాల్గొన్నారు.