
విఽధి నిర్వహణలో అప్రమత్తత అవసరం
● డీఎంఎస్ నాగేశ్వరరావు
రామగిరి(మంథని): ఉద్యోగులు విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ రీజియన్–2 డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ(మైనింగ్) నాగేశ్వరరావు సూచించారు. సెంటినరికాలనీ సీఎన్‌సీవోఏ క్లబ్‌లో ఆపరేషన్స్ డైరెక్టర్ సూర్యనారాయణ అధ్యక్షతన ఆర్జీ–3, ఏపీఏ 19వ ఏరియాస్థాయి త్రైపాక్షిక భద్రత సమీక్ష శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. భద్రతపై నిర్లక్ష్యం చేయవద్దన్నారు. పనిప్రదేశాలను తరచూ తనిఖీ చేస్తూ ప్రమాదాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఉద్యోగుల సంక్షేమంపైనా దృష్టి సారించాలని సూచించారు. తాగునీరు, కనీస సదుపాయలు కల్పించాలని చెప్పారు. ఓసీపీ–2 పీవో వెంకటరమణ వివిధ అంశాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కార్యక్రమంలో ఎలక్ట్రికల్ డీఎంస్ రాజ్‌కుమార్, జీఎంలు సుధాకర్‌రావు, నాగేశ్వరరావు, శ్రీనివాస్, మధుసూదన్, శ్రీనివాస్‌రెడ్డి, మైనింగ్, ఎలక్ట్రికల్, మెకానిక్ డీడీఎంఎస్‌లు ప్రేమ్‌కుమార్, రాజీవ్ ఓంప్రకాశ్‌వర్మ, దిలీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.