రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

Jul 9 2025 7:01 AM | Updated on Jul 9 2025 7:01 AM

రాష్ట

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

ధర్మారం(ధర్మపురి): దొంగతుర్తి జెడ్పీ హై స్కూల్‌కు చెందిన టెన్త్‌ విద్యార్థులు రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్‌ పోటీలకు ఎంపికై నట్లు పీఈటీ శ్రీనివాస్‌ తెలిపారు. ఆర్‌.అనూష, వైష్ణవి ఇటీవల గోదావరిఖనిలో జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ చూపినట్లు ఆయన పేర్కొన్నారు. ఈనెల 9 నుంచి 12వ తేదీ వరకు మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్‌లో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా జట్టులో ఈ విద్యార్థులు పాల్గొంటున్నట్లు ఆయన వివరించారు. విద్యార్థులను ప్రధానోపాధ్యాయుడు వేణుగోపాల్‌రెడ్డి, పీఈటీ శ్రీనివాస్‌, ఉపాధ్యాయులు అభినందించారు.

పోటీ పరీక్షలకు సన్నద్ధం చేయాలి

ధర్మారం(ధర్మపురి): ప్రభుత్వ జూనియర్‌ క ళాశాల విద్యార్థులను వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధం చేయాలని ఇంటర్మీడియట్‌ బోర్డు పరిశీలకుడు రమణారావు సూచించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను మంగళవారం ఆయన సందర్శించారు. విద్యార్థులను ఆకర్షించేలా పాఠాలు బోధించాలని ఆయన సూచించారు. ఈనెల 15 నుంచి ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ప్రిన్సిపాల్‌ అనంత రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

డ్రాపౌట్లను తగ్గించాలి

సుల్తానాబాద్‌(పెద్దపల్లి): ఇంటర్మీడియట్‌లో డ్రాపౌట్ల సంఖ్య తగ్గించాలని ప్రభుత్వ జూని యర్‌ కళాశాలల ఉమ్మడి జిల్లా పరిశీలకుడు రమణారావు సూచించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను ఆయన మంగళవారం సందర్శించారు. ఫస్టియర్‌లో ప్రవేశాలు, లెక్చరర్లపై ఆయన ఆరా తీశారు. విద్యార్థులకు అర్థమయ్యేలా పాఠాలు బోధించాలని అధ్యాపకులకు సూచించారు. జిల్లా ఇంటర్‌ విద్య నోడల్‌ అధికారి కల్పన, ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

సీపీఎస్‌ను రద్దు చేయాలి

జ్యోతినగర్‌(రామగుండం): సీపీఎస్‌ విధానా న్ని రద్దు చేసి పాత పింఛన్‌ స్కీం అమలు చేయాలని టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు, ఎంప్లాయీస్‌ జేఏసీ చైర్మన్‌ బొంకూరి శంకర్‌ డిమాండ్‌ చేశారు. స్థానిక ఎఫ్‌సీఐ క్రాస్‌ రోడ్డులో మంగళవారం టీఎన్జీవోల సంఘం మండల కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. ఆయన మాట్లాడుతూ, సంఘం బలోపేతానికి ఉద్యోగులు కలసికట్టుగా పనిచేయాలన్నారు. అనంతరం నూతన టీఎన్జీవో అధ్యక్షు డు డి.జగన్‌, కార్యదర్శి పి.కృష్ణ, కోశాధికారి రవితేజతోపాటు ఇతర కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. కార్యక్రమంలో నాయకులు సత్యనారాయణ, సందీప్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.

సమ్మెతో యూరియా ఉత్పత్తికి విఘాతం

ఫెర్టిలైజర్‌సిటీ(రామగుండం): దేశవ్యాప్తంగా బుధవారం చేపట్టే సమ్మెలో ఆర్‌ఎఫ్‌సీఎల్‌ కార్మికులు పాల్గొంటే యూరియా ఉత్పత్తికి విఘాతం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు. కర్మాగారంలో ఉత్పత్తి చేసే యూరియాలో 50శాతం మన రాష్ట్రానికే కేటాయిస్తున్నారని, అయితే, ఒకరోజు సమ్మెతో సుమారు 3,850 మెట్రిక్‌ టన్నుల యూరియా ఉత్పత్తికి విఘాతం కలుగుతుందని పేర్కొన్నారు.

విధులకు హాజరు కావాలి

గోదావరిఖని: కార్మిక సంఘాల పిలుపు మేర కు కార్మికులు బుధవారం సమ్మెకు వెళ్లకుండా విధులకు హాజరు కావాలని సింగరేణి డైరెక్టర్‌(పా) గౌతం పొట్రూ, డైరెక్టర్‌ వెంకటేశ్వర్లు కోరారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఏరియాల జీఎంలు, వివిధ విభాగాల అధికారులతో వారు మాట్లాడారు. కార్మికుల అంశం సింగరేణి పరిధిలో లేదన్నారు. ప్రతీ రోజు ఉత్పత్తి సాధించి, నిరంతర విద్యుత్‌ కో సం పాటుపడాలన్నారు. సమ్మెతో కంపెనీకి రూ.76 కోట్ల నష్టం వాటిల్లుతుందని, వేతనాల రూపంలో కార్మికులు 13.07కోట్లు నష్టపోతారన్నారు. ఆర్జీ–1 జీఎం లలిత్‌కుమార్‌, ఎస్‌వో టూ జీఎం ఆంజనేయప్రసాద్‌ పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక  
1
1/1

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement