
పట్టుకోసం పర్యటనలు
● శాఖలపై సమీక్షిస్తున్న డైరెక్టర్(పా) ● మూడు రోజులు పారిశ్రామిక ప్రాంతంలోనే గౌతం పొట్రూ
గోదావరిఖని: సుమారు దశాబ్దం తర్వాత సింగరేణి లో కీలక డైరెక్టర్(పా) పోస్టుకు ఐఏఎస్ అధికారిని ప్రభుత్వం నియమించింది. పదేళ్లుగా మైనింగ్ డైరెక్టర్లకు(పా)బాధ్యతలను అదనంగా అప్పగిస్తూ నె ట్టుకుంటూ రావడంతో డైరెక్టర్లపై బాధ్యతలు పెరిగి కార్మికుల సమస్యలు సకాలంలో పరిష్కరించలేదనే విమర్శలు మూటగట్టుకుంది. డైరెక్టర్లు తమ విధు ల్లో బిజీగా ఉంటుండగా కీలకమైన డైరెక్టర్(పా) కూడా మైనింగ్ డైరెక్టర్లకు అదనపు బాధ్యతలు అప్పగించడంతో ఫైళ్లు సకాలంలో ముందుకు కదల లేదని కార్మిక సంఘాలు సైతం అసంతృప్తితో ఉన్నాయి. అదనపు బాధ్యతలతో నెట్టుకు వస్తున్న డైరెక్టర్ పర్సనల్, అడ్మిస్ట్రేటివ్, వింగ్(పా)కు గౌతం పొట్రూ ఐఏఎస్ అధికారిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
15న బాధ్యతలు స్వీకరణ
గౌతం పొట్రూ గతనెల 15న సింగరేణి డైరెక్టర్(పా)గా బాధ్యతలు స్వీకరించారు. తన శాఖలపై పట్టుకోసం అన్ని ఏరియాల్లో పర్యటిస్తున్నారు. రామగుండం, బెల్లంపల్లి రీజియన్‌లోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి వాస్తవ పరిస్థితులు, పర్సనల్ విభాగం పనితీరు, సంక్షేమం, పర్మినెంట్, కాంట్రాక్టు ఉద్యోగులు తదితర అంశాలపై ఆరా తీస్తున్నారు. ఏరియాల వారీగా పర్సనల్ అధికారులతో సమీక్ష సమావేశాలను నిర్వహిస్తున్నారు. సోమ వారం గోదావరిఖని సింగరేణి ఇల్లెందు గెస్ట్‌హౌస్ చేరుకున్న ఆయన.. రెండు రోజులపాటు ఇక్కడే ఉండి పలు ఏరియాల్లో పర్యటించారు. పర్సనల్ అధికారులతో సమావేశమయ్యారు. మంగళవారం ఏరియాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వ హించారు. రామగుండం, బెల్లంపల్లి రీజియన్లలోనే అతిపెద్ద సింగరేణి ఏరియా మాస్పత్రిని తనిఖీ చేశా రు. వైద్య సౌకర్యాలపై ఆరా తీశారు. కార్మిక కుటుంబాలకు మరిన్ని మెరుగైన వైద్య సదుపాయాలను అందించాలని ఆదేశించారు. అంతేకాకుండా మంగళవారం బెల్లంపల్లి రీజియన్‌లో పర్యటించారు. బుధవారం కూడా ఇక్కడే ఉండి ఏఎల్‌పీ, భూపాలపల్లి ఏరియాల్లో పర్యటించనున్నట్లు సమాచారం.
నాణ్యమైన వైద్యం అందించాలి
కార్మిక కుటుంబాలకు నాణ్యమైన వైద్య సేవలందించాలని సింగరేణి డైరెక్టర్(పా) గౌతం పొట్రూ ఆదేశించారు. మంగళవారం ఆర్జీ–1 ఏరియా ఆస్పత్రిని తనిఖీ చేశారు. జనరల్ సర్జన్, ఈఎన్‌టీ నిపుణులను త్వరలో నియమిస్తామని ఆయన తెలిపారు. ఆర్జీ–1 జీఎం లలిత్‌కుమార్, ఏసీఎంవో అంబికా, పర్సనల్ మేనేజర్ రవీందర్‌రెడ్డి, సివిల్ డీజీఎం వరప్రసాద్, వర్క్‌షాప్ డీజీఎం జితేందర్‌సింగ్, సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ వీరారెడ్డి ఉన్నారు.