
మహోన్నత వ్యక్తి వైఎస్సార్
సుల్తానాబాద్‌రూరల్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మహోన్నత వ్యక్తి అని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు కొనియాడా రు. నారాయణపూర్‌లో మంగళవారం వైఎస్ రా జశేఖరరెడ్డి జయంతి ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టా రు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రాజశేఖరరెడ్డి అనేక సంక్షేమ ప థకాలు ప్రవేశపెట్టి బడుగు, బలహీన వర్గాలకు ఎంతో సేవ చేశారని కొనియాడారు. ఏఎంసీ చైర్మన్ ప్రకాశ్‌రావు, నాయకులు సతీశ్, దామోదర్, రమేశ్, జానీ, అబ్బయ్యగౌడ్ పాల్గొన్నారు.
ప్రజాసంక్షేమమే ధ్యేయం
ప్రజాసంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. కందునూరిపల్లె, నారాయణపూర్, కొదురుపాక, దేవునిపల్లి, చిన్నకల్వల గ్రామాల్లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. సీసీ రోడ్లను ప్రారంభించారు. ఇందిరమ్మ ఇళ్లకు ము గ్గు పోశారు. అనంతరం ఆయన మాట్లాడారు. సింగిల్‌విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, ఎంపీడీవో దివ్వదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
● ఎమ్మెల్యే విజయరమణారావు