
బాధితులకు అండగా ఉండాలి
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): పోలీసుస్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులు, బాధితులకు పోలీసులు అండగా ఉండాలని రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిశోర్ ఝూ సూచించారు. స్థానిక పోలీసుస్టేషన్‌ను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఠాణా భౌగోళిక పరిస్థితులు, ముఖ్యమైన ప్రదేశాలు, మావోయిస్టులు, వారికుటుంబ వివరాలు తదితర అంశాలపై ఆయన ఆరా తీశారు. విధి నిర్వహణలో పోలీసులు నిత్యం అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం ఠాణా ఆవరణలో మొక్క లు నాటారు. డీసీపీ కరుణాకర్, ఏసీపీ కృష్ణ, సీఐలు సుబ్బారెడ్డి, ప్రవీణ్‌కుమార్, ఎస్సై వెంకటేశ్, సిబ్బంది తదితరులు ఉన్నారు.
మొక్క నాటుతున్న సీపీ అంబర్ కిశోర్ ఝా