పునరావాస కాలనీలో సౌకర్యాలు కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

పునరావాస కాలనీలో సౌకర్యాలు కల్పించాలి

Mar 16 2025 12:20 AM | Updated on Mar 16 2025 12:21 AM

రామగిరి(మంథని): సింగరేణి లద్నాపూర్‌ ఆర్‌అండ్‌ ఆర్‌ కాలనీలో వసతులు కల్పించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఆదేశించారు. ఓసీపీ–2, లద్నాపూర్‌, రాజాపూర్‌ గ్రామాల్లో శనివారం కలెక్టర్‌ ప ర్యటించారు. లద్నాపూర్‌లోని 88 ఎకరాలను సింగరేణికి అప్పగించాలన్నారు. రోడ్డు, కాలువల మ ళ్లింపులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూ చించారు. డిసెంబర్‌ 4న చోటుచేసుకున్న స్వల్ప భూకంపంతో పెద్దపల్లి – మంథని మెయిన్‌రో డ్డు, ఎస్‌ఆర్‌ఎస్సీ కాలువలో ఏర్పడిన పగుళ్లను స రిచేయాలన్నారు. కాగా, బ్లాస్టింగ్‌లతో ఇళ్లకు ప గుళ్లు ఏర్పాడుతున్నాయని, దుమ్ము, ధూళితో అ నారోగ్యం బారిన పడుతున్నామని, తమ గ్రామా న్ని సింగరేణి స్వాధీనం చేసుకునేలా చూడాలని రాజాపూర్‌ గ్రామస్తులు కలెక్టర్‌కు విన్నవించారు. ‘కలెక్టర్‌ సారూ.. మీ కాళ్లు మొక్కుతా బాంచన్‌.. కనికరించండి’ అని లద్నాపూర్‌ గ్రామానికి చెందిన తోట్ల పోశమ్మ కలెక్టర్‌ కాళ్లపై పడింది. సింగరే ణి నుంచి పూర్తి పరిహారం రాలేదని, రాత్రిపూట అధికారులు వచ్చి ఇళ్లు ఖాళీ చేయాలని బెదిరిస్తున్నారని ఆవేదన చెందింది. తగిన న్యాయం చేస్తా మని కలెక్టర్‌ తెలిపారు. ఆర్డీవో సురేశ్‌, ఆర్జీ–3 జీఎం సుధాకర్‌రావు, ఆర్‌అండ్‌బీ ఈఈ భావ్‌సింగ్‌, తహసీల్దార్‌ సుమన్‌, ఆర్‌ఐ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement