నాణ్యమైన భోజనం పెట్టాలి | - | Sakshi
Sakshi News home page

నాణ్యమైన భోజనం పెట్టాలి

Mar 12 2025 7:25 AM | Updated on Mar 12 2025 7:23 AM

పెద్దపల్లిరూరల్‌: ప్రభుత్వ గురుకుల పాఠశాల ల్లో చదివే బాల, బాలికలకు నాణ్యమైన భోజ నం అందించాలని అడిషనల్‌ కలెక్టర్‌ అరుణశ్రీ ఆదేశించారు. రంగంపల్లిలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలికల గురుకులాన్ని మంగళవారం ఆమె సందర్శించారు. వసతులపై ఆరా తీశారు. డార్మెంటరీ, క్లాస్‌రూం, డైనింగ్‌హాల్‌, వంటగది, స్టోర్‌రూంలను తనిఖీ చేశారు. నా ణ్యమైన కూరగాయలు, పండ్లు ఇవ్వాలని అ న్నారు. పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మంచి ఫ లితాలు వచ్చేలా ప్రోత్సహించాలని అన్నారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ప్రిన్సిపాల్‌ మణిదీప్తి, ఉపాధ్యాయినులు ఉన్నారు.

భద్రత, శ్రేయస్సు కీలకం

జ్యోతినగర్‌(రామగుండం): పరిశ్రమ భద్రత, కార్మికులు, ఉద్యోగుల శ్రేయస్సు కీలకమని తె లంగాణ ప్రభుత్వ కరీంనగర్‌ ఫ్యాక్టరీల డిప్యూ టీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ గంగాధర్‌రెడ్డి అన్నారు. ఎన్టీ పీసీ ప్రాజెక్టు పరిపాలనా భవనంలో మంగళవారం జాతీయ భద్రతా వారోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ప్రాజెక్టు ఎగ్జి క్యూటివ్‌ డైరెక్టర్‌ చందన్‌కుమార్‌ సామంతతో కలిసి ఆయన మాట్లాడారు. ఎన్టీపీసీలో విద్యు త్‌ ఉత్పత్తి భేషుగ్గా ఉందన్నారు. అనంతరం అ ధికారులు, ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు భద్రతపై ప్రతిజ్ఞ చేశారు. పలు పోటీల్లో విజేత లకు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందించా రు. జనరల్‌ మేనేజర్లు అలోక్‌ కుమార్‌ త్రిపాఠి, అంజనా రంజన్‌ దాస్‌, సీఐఎస్‌ఎఫ్‌ సీనియర్‌ కమాండెంట్‌ ముకేశ్‌కుమార్‌, ఉద్యోగ గుర్తింపు సంఘం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వేముల కృష్ణ య్య, ప్రధానకార్యదర్శి రాజేశ్వర్‌, అధికారులు బహేకర్‌, సుప్రకాశ్‌ చక్రవర్తి పాల్గొన్నారు.

పంపుసెట్లకు కెపాసిటర్లు అమర్చుకోవాలి

రామగిరి(మంథని): రైతులు తమ వ్యవసాయ పంపుసెట్లకు నాణ్యమైన కెపాసిటర్లు అమర్చుకోవాలని ట్రాన్స్‌కో ఎస్‌ఈ మాధవరావు సూ చించారు. కల్వచర్ల, బుధవారంపేట(రామ య్యపల్లి)లో మంగళవారం పొలంబాట చేపట్టారు. కల్వచర్లలో ఓవర్‌లోడ్‌ నియంత్రణకు 100 కేవీ సామర్థ్యంగల విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడారు. కెపాసిటర్లు బిగిస్తే విద్యుత్‌ సరఫరాలో హెచ్చుతగ్గులు నియంత్రణలోకి వస్తాయన్నారు. విద్యుత్‌ మోటార్లపై భారం ప డదని తెలిపారు. మంథని డివిజన్‌ ఏఈ ప్రభాకర్‌, ఏడీఈ కనకయ్య, ఏఈ మహేందర్‌, సబ్‌ ఇంజినీర్‌ సతీశ్‌ తదితరులు పాల్గొన్నారు.

పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ

జూలపల్లి(పెద్దపల్లి): గ్రామాల్లో ప్రత్యేక పారిశుధ్య పనులపై శ్రద్ధవహించాలని జిల్లా పంచా యతీ అధికారి వీరబుచ్చయ్య సూచించారు. వెంకట్రావుపల్లె, కాచాపూర్‌లో చేపట్టిన ప్రత్యే క పారిశుధ్య పనులను మంగళవారం మండల పంచాయతీ అధికారి అనిల్‌రెడ్డితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. సెగ్రిగేషన్‌ షెడ్డు, పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా తీరు పరిశీలించారు. పంచాయతీ కార్యాలయంలో రికార్డులు తనిఖీ చేశారు. పంచాయతీ కార్యదర్శులు సాగర్‌రావు, రేవతి పాల్గొన్నారు.

క్వింటాలు పత్తి రూ.6,866

పెద్దపల్లిరూరల్‌: స్థానిక వ్యవసాయ మార్కెట్‌ యార్డులో మంగళవారం పత్తి క్వింటాలుకు గరిష్టంగా రూ.6,866 ధర పలికింది. కనిష్టంగా రూ.5,003గా, సగటు రూ.6,455గా ధర నమోదైందని మార్కెట్‌ సెక్రటరీ మనోహర్‌ తెలిపారు. రైతుల నుంచి 525 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

నాణ్యమైన భోజనం పెట్టాలి1
1/3

నాణ్యమైన భోజనం పెట్టాలి

నాణ్యమైన భోజనం పెట్టాలి2
2/3

నాణ్యమైన భోజనం పెట్టాలి

నాణ్యమైన భోజనం పెట్టాలి3
3/3

నాణ్యమైన భోజనం పెట్టాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement