● రామగుండం సీపీ అంబర్‌కిశోర్ ఝా ● బాధ్యతలు స్వీకరించిన పోలీస్ అధికారి
గోదావరిఖని: చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని రామగుండం పో లీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా హెచ్చరించా రు. రామగుండం పోలీస్ కమిషనర్‌గా సోమవా రం ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంత రం విలేకరులతో మాట్లాడారు. శాంతిభద్రతల పరిరక్షణే తమ ధ్యేయమన్నారు. సత్ప్రవర్తన కలిగిన వారికి ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తామన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నేరాల నియంత్రణకు కృషి చేస్తామని తెలిపారు. ల్యాండ్ మాఫియా, డ్రగ్స్, గంజాయి రవాణాపై ఉక్కుపా దం మోపుతావని, ప్రజల సహకారంతో ముందుకెళ్తామన్నారు. ఠాణాలకు వచ్చే వారి సమస్యలను త్వరిత గతిన పరిష్కరిస్తూ, చట్ట పరిధిలో న్యాయం జరిగేలా చూస్తామని పేర్కొన్నారు.
2009 ఐపీఎస్ బ్యాచ్..
అంబర్ కిశోర్ ఝా 2009 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన పోలీస్ అధికారి. 2011లో తొలిసారి ఉమ్మడి ఆదిలాబాద్ ఏఎస్పీ, 2012 వరంగల్ ఓఎస్డీగా, అదనపు ఎస్పీగా, 2014లో వరంగల్ ఎస్పీగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తొలిఎస్పీగా పనిచేశారు. 2018లో హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీగా, అదే ఏడాది కేంద్ర సర్వీసుల్లో విధులు నిర్వహించారు. గతేడాది ఫిబ్రవరిలో డీఐజీగా పదోన్నతి లభించింది. రాచకొండ జాయింట్ పోలీస్ కమిషనర్‌గా పనిచేశారు. అంతకుముందు వరంగల్ సీపీగా పనిచేశారు. కాగా, బాధ్యతలు స్వీకరించిన సీపీకి మంచిర్యాల, పెద్దపల్లి డీసీపీలు భాస్కర్, కరుణాకర్ తదితరులు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.