కరీంనగర్‌స్పోర్ట్స్: పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్‌పూర్ గ్రామానికి చెందిన టి.చికిత విలువిద్య(ఆర్చరీ)లో అంతర్జాతీయస్థాయిలో రాణిస్తోంది. చిన్న వయస్సులోనే వరల్డ్‌కప్‌లో పాల్గొంటూ పతకాల పంట పండిస్తోంది. ప్రస్తుతం పంజాబ్‌లోని సోనీపట్‌లో శిక్షణ పొందుతోంది.చికిత తండ్రి శ్రీనివాస్‌రావు రైతు. తల్లి శ్రీలత గృహిణి. మార్చి తొలివారంలో బ్యాంకాక్‌లో జరిగిన ఏషియన్ గేమ్స్‌లో కాంస్యం సాధించింది. ఏప్రిల్‌లో ఫ్లోరిడాలో జరగనున్న వరల్డ్‌కప్ స్టేజ్–1, మేలో చైనాలో జరిగే వరల్డ్‌కప్ స్టేజ్– 2 పోటీలకు సిద్ధమవుతోంది. ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకం సాధిస్తానని చెబుతోంది.