ఇన్‌స్ట్రాగామ్‌ అశ్విని | - | Sakshi
Sakshi News home page

ఇన్‌స్ట్రాగామ్‌ అశ్విని

Mar 8 2025 1:24 AM | Updated on Mar 8 2025 1:23 AM

విద్యానగర్‌(కరీంనగర్‌): ఠాకూర్‌ అశ్విని అలియస్‌ ఆశాది కరీంనగర్‌లోని భగత్‌నగర్‌. నగరంలోని డైలీ మార్కెట్‌, వేంకటేశ్వరస్వామి గుడి వద్ద ఫుట్‌పాత్‌పై సీజనల్‌ వ్యాపారం చేస్తుంది. మట్టికుండలు, దీపాల ప్రమిదలు, రంగుల ముగ్గులు, పచ్చడి జాడీలు, దీపాల వత్తులు అమ్ముతుంది. రెండేళ్ల కిత్రం వ్యాపార అభివృద్ధి కోసం తొలిసారిగా ఆమె అమ్మే వస్తువుల గురించి రీల్‌ చేసి ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్‌ చేయగా వేల సంఖ్యలో వ్యూస్‌ వచ్చాయి. దీంతో మరిన్ని రీల్స్‌ చేసి పోస్ట్‌ చేసింది. వాటికి కూడా ఆశించిన దానికన్నా ఎక్కువగా స్పందన రావడంతో సినిమా పాటలు, జానపద గేయాలు, భక్తి, రోమాంటిక్‌, ప్రేమ, ఎడబాటు తదితర అంశాలపై రీల్స్‌ చేయడం మొదలు పెట్టగా వాటికి కూడా లక్షల్లో వ్యూస్‌ రావడం, ఆరో తరగతి వరకే చదివిన ఆశాకు భర్త, కుటుంబ సభ్యులు ప్రోత్సాహం తోడవడంతో రీల్స్‌పై మక్కువ పెంచుకుంది. రెండేళ్లలో 600 వరకు రీల్స్‌ చేసింది. ‘ఇన్‌స్ట్రాగామ్‌లో నా రీల్స్‌ చూసిన డైరెక్టర్లు చాలా మంది వారి సినిమాల్లో అడిగారు. కీ రోల్‌ పాత్రలు వస్తే తప్పకుండా చిన్న, పెద్ద సినిమాల్లో చేస్తాను’ అని ఠాకూర్‌ అశ్విని వెల్లడించింది.

సిరిసిల్లక్రైం: మహిళలు, విద్యార్థులకు రక్షణ కల్పించేందుకు రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్‌ అధికారులు పోలీస్‌ అక్క పేరిట జిల్లాలోని ప్రతీ పోలీస్‌ స్టేషన్‌లో ఒక మహిళా కానిస్టేబుల్‌ను కేటాయించారు. 2024 డిసెంబర్‌లో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, మహిళలను మమేకం చేస్తూ ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. వేధింపులకు గురైతే బాధితులు ఇంట్లో మనిషి మాదిరిగా పోలీస్‌ అక్కకు చెప్పుకునేలా విధివిధానాలు ఖరారు చేశారు. పోలీస్‌ అక్క కార్యక్రమం ప్రారంభించినప్పటి నుంచి దాదాపు 220 అవగాహన కార్యక్రమాలను నిర్వహించిన పోలీసులు నాలుగు ఫిర్యాదులు స్వీకరించారు. అందులో మూడు ఈ–పెట్టి కేసులు ఒక ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు అధికారిక గణంకాలు ఉన్నాయి.

బాధితులకు అండగా ‘పోలీస్‌ అక్క’

ఇన్‌స్ట్రాగామ్‌ అశ్విని 1
1/1

ఇన్‌స్ట్రాగామ్‌ అశ్విని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement