ఉపాధి పనులు కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

ఉపాధి పనులు కల్పించాలి

Mar 5 2025 1:17 AM | Updated on Mar 5 2025 1:11 AM

సుల్తానాబాద్‌రూరల్‌(పెద్దపల్లి): ఉపాధిహామీ కూలీలకు కొలతల ప్రకారం పని కల్పించాల ని, రోజూ వేతనం రూ.300 గిట్టుబాటయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కాళిందినీదేవి అన్నారు. సుద్దాల గ్రా మాన్ని మంగళవారం ఆమె సందర్శించి ఈజీ ఎస్‌ పనులు, నర్సరీలను పరిశీలించారు. పని ప్రదేశాల్లో సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఎంపీడీవో దివ్యదర్శన్‌రావు, ఏపీవో మల్లేశ్వరి, జేఈ రాజ్‌కుమార్‌, పంచాయతీ కార్యదర్శి సాగర్‌ తదితరులు పాల్గొన్నారు.

పర్యావరణాన్ని పరిరక్షించాలి

జ్యోతినగర్‌(రామగుండం): పర్యావరణ పరిరక్షణతోనే భావితరాలకు మనుగడ ఉంటుందని ఎన్టీపీసీ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ చందన్‌ కుమార్‌ సామంత అన్నారు. జాతీయ భ ద్రతా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రాజె క్టు సర్వీసు భవనంలో మంగళవారం ఆయన సురక్ష జెండా ఆవిష్కరించి మాట్లాడారు. ఉ ద్యోగులు భద్రత ప్రవర్తనా నియమావళి పా టించాలని సూచించారు. అనంతరం తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో భద్రత ప్రతిజ్ఞ చేశా రు. క్యాంటీన్‌ వరకు ర్యాలీ, తెలంగాణ సర్వీస్‌ భవనంలో సమావేశం నిర్వహించారు. జనరల్‌ మేనేజర్లు అలోక్‌ కుమార్‌ త్రిపాఠి, అంజనా రంజన్‌ దాస్‌, సింఘారాయ్‌, సీఐఎస్‌ఎఫ్‌ డి ప్యూటీ కమాండెంట్‌ శాస్త్రి పాల్గొన్నారు.

మహిళా పోలీస్‌స్టేషన్‌ సిద్ధం

పెద్దపల్లిరూరల్‌: జిల్లా కేంద్రంలో మహిళా పో లీస్‌స్టేషన్‌ ఏర్పాటు కోసం పోలీసు ఉన్నతాధికారులు భవనం సిద్ధం చేశారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డు ఆవరణలోని ఓ భవనాన్ని ఠాణా కోసం ఎంపిక చేశారు. విధు ల నిర్వహణకు అనుగుణంగా ఏర్పాట్లు చేశా రు. పనులు పూర్తి కావడంతో ప్రారంభోత్సవానికి పోలీసుస్టేషన్‌ సిద్ధంగా ఉంది.

దరఖాస్తుల ఆహ్వానం

పెద్దపల్లిరూరల్‌: ఉచిత కుట్టు మిషన్ల కోసం మైనారిటీలు ఈనెల 6 (గురువారం)లోగా జి ల్లా మైనార్టీ సంక్షేమ శాఖ కార్యాలయంలో ద రఖాస్తు చేసుకోవాలని ఇన్‌చార్జి అధికారి రంగారెడ్డి కోరారు. తెల్లరేషన్‌కార్డు, మైనార్టీ కార్పొరేషన్‌, ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన ట్రె యినింగ్‌ ఇనిస్టిట్యూట్‌ ద్వారా తీసుకున్న టైలరింగ్‌ సర్టిఫికెట్లు, ఐదో తరగతి ఉత్తీర్ణత సర్టిఫికెట్‌ దరఖాస్తుతో జతపర్చాలన్నారు. వితంతువులు, అనాథలు, ఒంటరి మహిళలకు ప్రాధాన్యత ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

బకాయిలు చెల్లించాలి

పెద్దపల్లిరూరల్‌: పంచాయతీ కార్మికుల పెండింగ్‌ వేతనాలను వెంటనే చెల్లించాలని, ఇక నుంచి ప్రతినెలా గ్రీన్‌చానల్‌ ద్వారానే చెల్లించా లని సీఐటీయూ జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సీ పెల్లి రవీందర్‌ డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ ఉ ద్యోగుల తరహాలో ప్రతినెలా 2025 జనవరి 1 నుంచి గ్రీన్‌చానల్‌ ద్వారా వేతనాలను చెల్లిస్తా మని ప్రభుత్వం ప్రకటించిందని గుర్తుచేశారు. వేసవిలో ఒకపూట పనివిధానం అమలు చేయాలని ఆయన కోరారు. నాయకులు ఖాజా, లచ్చయ్య, శ్రీనివాస్‌, రాజయ్య, లక్ష్మణ్‌, నరేశ్‌, సతీశ్‌ తదితరులు పాల్గొన్నారు.

కేజీబీవీ ఆకస్మిక తనిఖీ

రామగిరి(మంథని): పన్నూర్‌ కేజీబీవీని డీఈ వో మాధవి మంగళవారం తనిఖీ చేశారు. వంటగది, డైనింగ్‌హాల్‌, తరగతి గదులను పరిశీలించారు. పదో తరగతి విద్యార్థులతో మాట్లాడాడి భోజనం గురించి అడిగి తెలుసుకున్నారు.

ఉపాధి పనులు కల్పించాలి 1
1/4

ఉపాధి పనులు కల్పించాలి

ఉపాధి పనులు కల్పించాలి 2
2/4

ఉపాధి పనులు కల్పించాలి

ఉపాధి పనులు కల్పించాలి 3
3/4

ఉపాధి పనులు కల్పించాలి

ఉపాధి పనులు కల్పించాలి 4
4/4

ఉపాధి పనులు కల్పించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement