విధులకు ఆటంకం కలిగించిన ఐదుగురు.. | - | Sakshi
Sakshi News home page

విధులకు ఆటంకం కలిగించిన ఐదుగురు..

Mar 5 2025 1:15 AM | Updated on Mar 5 2025 1:15 AM

కోనరావుపేట(వేములవాడ): ఓ వ్యక్తి ఇంటిపై దాడికి పాల్పడటంతోపాటు పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన ఐదుగురిని అరెస్టు చేసినట్లు చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. కోనరావుపేట మండలం రామన్నపల్లి(బావుసాయిపేట)కి చెందిన బత్తుల మల్లయ్య గత జనవరి 19న బైక్‌పై వెళ్తూ ప్రమాదవశాత్తు కిందపడి మృతిచెందాడు. అతని భార్య రేణవ్వ ఫిబ్రవరి 20న నాంపల్లిలో ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరి మృతికి అదే గ్రామానికి చెందిన బత్తుల అంజయ్య కారణమంటూ బత్తుల ఎల్లయ్య, అంజయ్య, కొమురయ్య, చిన్న భీమయ్య, రాజయ్యతోపాటు మరికొందరు రేణవ్వ మృతదేహాన్ని నాంపల్లి నుంచి రామన్నపల్లికి తీసుకొచ్చారు. అంజయ్య ఇంటి ఎదుట ఆందోళన చేపట్టి, ఆ ఇంటిపై దాడికి పాల్పడ్డారు. కోనరావుపేట పోలీసులు ఆపేందుకు ప్రయత్నిస్తే వారి విధులకు ఆటంకం కలిగించారు. దీంతో ఫిబ్రవరి 22న వారిపై కేసు నమోదు చేశారు. మంగళవారం ఆ ఐదుగురినీ అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు.

ముస్తాబాద్‌లో 12 మందిపై కేసు

ముస్తాబాద్‌(సిరిసిల్ల): విద్యుదాఘాతంతో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని తరలిస్తుంటే పోలీసుల విధులకు ఆటంకం కలిగించినవారిపై కేసు నమోదు చేసినట్లు ముస్తాబాద్‌ ఎస్సై గణేశ్‌ మంగళవారం తెలిపారు. ముస్తాబాద్‌ మండల కేంద్రానికి చెందిన వల్లపు దేవరాజు వ్యవసాయ బావిలో పూడిక తీస్తుండగా, ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడన్నారు. మృతదేహాన్ని పోలీసులు అంబులెన్స్‌లో సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా రోడ్డుపై ఆందోళన చేసిన 12 మందిపై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement