
మాట్లాడుతున్న సంధ్యారాణి
● బీజేపీ రామగుండం ఎమ్మెల్యే అభ్యర్థి కందుల సంధ్యారాణి
గోదావరిఖని(రామగుండం): సమస్యల పరిష్కా రం కోసం ప్రజల తరఫున పోరాటం చేస్తామని బీజేపీ రామగుండం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి, ఓడిపోయిన కందుల సంధ్యారాణి తెలిపారు. సోమవారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కాషాయ జెండాను ఎట్టిపరిస్థితుల్లో వీడేది లేదని, రాబోయే కార్పొరేషన్, ఎంపీ ఎన్నికల్లో పార్టీ గెలుపునకు తనవంతు కృషి చేస్తానన్నారు. తన విజయం కోసం అహర్నిశలు శ్రమించిన అన్ని వర్గాల ప్రజలు, నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. దేశంలోని మూడు రాష్ట్రాల్లో బీజేపీకి మంచి మెజారిటీ వచ్చిందని పేర్కొన్నారు. కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటూ పార్టీ బలోపేతానికి పని చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు గాండ్ల ధర్మపురి, వడ్డేపల్లి రామచంద్రం, సుల్వ లక్ష్మీనర్సయ్య, కోమల మహేశ్, కొండపర్తి సంజీవ్‌కుమార్, గోపగోని నవీన్‌గౌడ్, గాండ్ల స్వరూప, మూకిరి రాజు, బోడకుంట జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.