
స్వీట్లు పంచుకుంటున్న సింగరేణి ఉద్యోగులు
యైటింక్లయిన్‌కాలనీ: మంథని ఎమ్మెల్యేగా శ్రీధర్‌బాబు గెలుపుపై ఆర్జీ–2 ఏరియా వర్క్‌షాప్‌లో కాంగ్రెస్ మైనారిటీ సీనియర్ నాయకుడు మురాద్ ఖాన్(మథిన్) ఆధ్వర్యంలో నాయకులు సోమవారం సంబరాలు జరుపుకున్నారు. సింగరేణి ఉద్యోగులకు స్వీట్లు పంపిణీ చేశారు. శ్రీధర్‌బాబు మంత్రి హోదాలో సింగరేణి ఏరియాలో అడుగుపెట్టాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీవైజీఎం ఎర్రన్న, ఎస్‌ఈ రాంరెడ్డి, ఇంజినీర్ సంజీవ్, ఫోర్‌మెన్లు రామారావు, బాబు, రాజ్‌కుమార్, ప్రభాకర్ రెడ్డి, దశరథం, శ్రీనివాస్, రవీందర్, రఫీక్, ఇజాజ్ ఖాన్, కృష్ణ, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జ్యోతినగర్: రామగుండం ఎమ్మెల్యేగా మక్కాన్‌సింగ్ ఘన విజయం సాధించడంతో ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. సోమవారం ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు లేబర్ గేట్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు బాబా, సత్యంల ఆధ్వర్యంలో మక్కాన్‌సింగ్ సోదరుడు అయోధ్య సింగ్ కార్మికులకు మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ఆయన ముందుంటారని అన్నారు.

ఎన్టీపీసీ లేబర్ గేట్ వద్ద..