
గాయపడిన మహేశ్
గోదావరిఖని(రామగుండం): డీజే వద్దన్నందుకు కర్రలతో దాడి చేసి, ఓ వ్యక్తిని గాయపరిచిన నలుగురిపై కేసు నమోదు చేసినట్లు గోదావరిఖని వన్‌టౌన్ ఎస్‌ఐ సమ్మయ్య తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి రామగుండం ఎమ్మెల్యే గెలుపు సందర్భంగా స్థానిక రాజీవ్‌నగర్‌లో బీఆర్‌ఎస్ నాయకుడు ఎంచర్ల మహేశ్ ఇంటి ఎదుట డీజే సౌండ్స్‌తో పలువురు నృత్యాలు చేశారు. వద్దని చెప్పినా వినకపోవడంతో అతను ఇంట్లో నుంచి కొద్దిసేపు బయటకు వెళ్లిపోయాడు. తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత పాత గొడవలు దృష్టిలో పెట్టుకొని, కర్రలతో దాడి చేయగా గాయపడ్డాడు. దాడికి పాల్పడిన మేకల పోశం, మేకల మహేశ్, పల్లె ఉదయ్, పల్లె సంజయ్‌లపై కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు. కాగా, గాయపడిన మహేశ్‌ను మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సోమవారం పరామర్శించి, ధైర్యం చెప్పారు.