
మాట్లాడుతున్న రాజిరెడ్డి
యైటింక్లయిన్‌కాలనీ: జిల్లా పరిధిలోని మూడు నియోజకవర్గాల్లో నాయకులు, కార్యకర్తల సమష్టి కృషితోనే కాంగ్రెస్ విజయం సాధించిందని ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మారెల్లి రాజిరెడ్డి అన్నారు. సోమవారం యైటింక్లయిన్‌కాలనీ ప్రెస్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాలనీలోని ఐదు డివిజన్లతోపాటు రామగిరి మండలంలోని వెంకట్రావుపల్లి పంచాయతీ పరిధి కేకే నగర్, కుమారస్వామి నగర్, షాపింగ్ కాంప్లెక్స్ తదితర ఏరియాలకు చెందిన ప్రజలు కాంగ్రెస్‌పై నమ్మకంతో ఓటు వేసి, గెలిపించారని పేర్కొన్నారు. రామగుండం ఎమ్మెల్యేగా ఎంఎస్ రాజ్‌ఠాకూర్‌ను, మంథనిలో శ్రీధర్ బాబును భారీ మెజారిటీతో గెలిపించిన సింగరేణి కార్మికులకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కాలనీ పట్టణ అధ్యక్షుడు గుండేటి రాజేశ్, నాయకులు మార్క రాజు, రాములు, తిరుపతి రెడ్డి, సారయ్య, రాజేశం, యాదగిరి తిరుపతి, వీరారెడ్డి, చాట్ల సదానందం, రమేశ్ రెడ్డి, అవినాష్ తదితరులు పాల్గొన్నారు.