
సంధ్యారాణి
గోదావరిఖని: పోలింగ్ సందర్భంగా 144సెక్షన్ అమలులో ఉందని, దీనిని ఉల్లంఘిస్తూ ర్యాలీ నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులపై చర్య తీసుకోవాలని బీజేపీ అభ్యర్థి కందుల సంధ్యారాణి డిమాండ్ చేశారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధగా వ్యవహరించిన నాయకులపై ఏం చర్యలు తీసుకున్నారో పోలీసులు, ఎన్నికల అధికారులు చెప్పాలన్నారు. చట్టపరమైన కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. 144 సెక్షన్ అమల్లో ఉన్న సమయంలో ర్యాలీలకు ఎవరు అనుమతిచ్చారని, ర్యాలీలు నిర్వహిస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వెంటనే దీనిపై పోలీసులు, ఎన్నికల అధికారులు స్పందించాలని ఆమె కోరారు.