సాగుకు అండ
మాది సీతంపేట మండలంలోని జగ్గడుగూడ గ్రామం. మా కుటుంబం పేరిట 2020 అక్టోబర్ 2న జగనన్న ప్రభుత్వంలో 2.14 సెంట్లలో ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టా ఇచ్చారు. అనంతరం రైతు భరోసా కింద ఏటా రూ.13,500ల చొప్పున పెట్టుబడి సాయం అందించారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి సాయం అందడం లేదు.
– సవర జయమ్మ, తిరుపతి,
జగ్గడుగూడ గ్రామం
ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అడకుండానే మేము సాగు చేస్తున్న 2 ఎకరాల కొండపోడు భూమికి ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాను మంజారు చేశారు. రైతు భరోసా సాయం కూడా అందజేశారు. ఆయన మేలు మరచిపోలేనిది.
–మండంగి ఆనంద్,
గిరిజన రైతు, బల్లేరుగూడ,
జియ్యమ్మవలస మండలం


