చదువుకు అండగా నిలిచారు
‘నా పేరు వరిరెడ్డి పూజ. మాది పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలోని మాదలింగి గ్రామం. నిరుపేద కుటుంబం. నాకు తమ్ముడు రాంమకుమార్, చెల్లి శ్రీజ ఉన్నారు. మా చిన్నతనంలోనే తండ్రి చనిపోయారు. అమ్మ దమయంతికి వచ్చిన టైలరింగ్ వృత్తితో మా జీవనం సాగేది. ఉన్నత చదువులు చదివించాలని అమ్మ కలలు కనేది. ఊర్లో ఉన్న పాఠశాల వరకు మాత్రమే చదివించగల ఆర్ధిక స్థోమత మాత్రమే ఉండేది. ఫీజురీయింబర్స్ ఆర్థిక సాయంతో పిల్లలను చదివించవచ్చని అమ్మ తెలుసుకొని నన్ను ఇంజిరింగ్ విద్యకు ప్రోత్సహించింది. దీనివల్లే నేను ఇంజినీరింగ్ ఈసీఈ కోర్సు పూర్తిచేసి ప్రస్తుతం హైదరాబాద్‌లో ఒక సాఫ్ట్‌వేర్ సంస్థలో ఇంజినీరింగ్ వృత్తిలో స్థిరపడ్డాను. తమ్ముడు ఐటీఐ పూర్తిచేసి ఉద్యోగం తెచ్చుకున్నాడు. చెల్లి కూడా అమ్మఒడి సాయంతో చదువుకుంది. ఫీజురీయింబర్స్‌మెంట్‌తో గత ప్రభుత్వం సాయం చేయకపోతే చదువు పాఠశాల విద్యతోనే నిలిచిపోయేది.
– వరిరెడ్డి పూజ, ఫీజురీయింబర్స్‌మెంట్ లబ్ధిదారు, మాదిలింగి, కొమరాడ
నా పేరు బిడ్డిక నూకయ్య. మాది భామిని మండలంలోని నల్లరాయిగూడ గ్రామం. 2019లో ముఖ్యమంత్రిగా వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక మా ఊరి దశ, దిశ మారింది. సచివాలయం భవనం నిర్మించారు. సీసీ రోడ్డు వేశారు. నల్లరాయిగూడ గ్రామ పంచాయితీగా ఏర్పాటైంది. ఆదివాసీ మహిళ బిడ్డిక గుయామి ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఏన్నికై ంది. హెల్త్‌సెంటర్, ఆర్‌బీకే అందుబాటులోకి వచ్చింది. ప్రభుత్వ గిరిజన పాఠశాలను నాడు–నేడు నిధులతో అందంగా తీర్చిదిద్దారు. పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు.
ప్రతీ మనిషి తన జీవితంలో సొంతిల్లు కట్టుకోవాలని కలలు కంటాడు. నేను కూడా మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాడిని. వాచ్ మెకానిక్‌గా పనులు చేస్తూ భార్య సుగుణతో పాటు ఇద్దరు పిల్లలను పోషించుకొచ్చాను. స్మార్ట్‌ఫోన్ల రాకతో వాచ్ మెకానిక్‌గా ఉపాధి కోల్పోయాను. ఆటో డ్రైవర్‌గా కొత్తజీవితాన్ని పునఃప్రారంభించాను. జగనన్న హయాంలో భార్య సుగుణ పేరిట ఇంటి స్థలం కేటాయించారు. ఇంటి నిర్మాణానికి ఆర్థికసాయం అందజేశారు. సొంతింటి కల నెరవేరింది. జీవితం సాఫీగా సాగిపోతోంది.
చదువుకు అండగా నిలిచారు


