ఇద్దరి పిల్లలకూ సచివాలయ కొలువు
పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం పలగర గ్రామానికి చెందిన ఎ.పోలినాయుడు, గౌరీశ్వరి దంపతులకు కుమారుడు మణికృష్ణ, కుమార్తె కీర్తిప్రియ ఉన్నారు. కుమారుడు అగ్రికల్చర్ డిప్లమో, కుమార్తె ఫిషరీస్‌లో బీఎస్సీ చదివారు. వీరి చదువులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎంతగానో సహకరించింది. అంతేకాదు.. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ వల్ల ఇద్దరికీ ఒకేసారి ప్రభుత్వ కొలువులు రావడంతో ఆ ఇంట ఆనందం వెల్లివిరిసింది. కీర్తిప్రియ వీఎఫ్‌ఏగా, మణికృష్ణ గ్రామ వ్యవసాయ సహాయకుడిగా సచివాలయాల్లో కొలువులు పొందారు. లక్షల సంఖ్యలో ప్రభుత్వ కొలువులు తీసి.. నిరుద్యోగ యువతకు, మధ్యతరగతి కుటుంబాలకు సర్కారు ఉద్యోగం కల నెరవేర్చిన జగన్‌మోహన్‌రెడ్డి చల్లగా ఉండాలని ఆ తల్లిదండ్రులు ఆకాంక్షిస్తున్నారు.


