రాష్ట్ర స్థాయికి ‘గ్రామ ముస్తాబు’ నమూనా
పార్వతీపురం రూరల్: మండలంలోని నర్సిపురం జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు రూపొందించిన గ్రామ ముస్తాబు నమూనా పార్వతీపురం మన్యం జిల్లా స్థాయి సైనన్స్‌ఫెయిలో న్యాయనిర్ణేతలను ఆకట్టుకుంది. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై ంది. పర్యావరణంపై ప్రేరణ, గ్రామాల పరిశుభ్రత, వ్యర్థాల సమర్థ నిర్వహణపై కలెక్టర్ ఆలోచనలకు ప్రతిరూపంగా గైడ్ టీచర్ గొట్టాపు మురళీకృష్ణ పర్యవేక్షణలో విద్యార్థులు రిషింద్ర నాయుడు, గుణవర్దన్ ఈ నమూనాను సిద్ధం చేశారు. పల్లెల ప్రగతికి పర్యావరణ పరిరక్షణే పునాది అన్నదే ప్రాజెక్టు సారాంశం. విద్యార్థులను హెచ్‌ఎం బోను సత్యనారాయణ, ఉపాధ్యాయులు శనివారం అభినందించారు.
క్రమ‘శిక్షణ’తో పూర్తిచేయండి
విజయనగరం క్రైమ్: కానిస్టేబుల్ ఉద్యోగం మిగిలిన శాఖల కన్నా భిన్నమైనది.. విధి నిర్వహణలో క్రమశిక్షణ, అంకితభావాన్ని ప్రదర్శించాల్సి ఉంటుంది.. మారుతున్న నేరాలకు అనుగుణంగా వృత్తి నైపుణ్యాలు మెరుగుపర్చుకోవాలి.. సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని పోలీస్ అభ్యర్థులకు ఎస్పీ దామోదర్ దిశానిర్దేశం చేశారు. జిల్లా నుంచి ఎంపికై న 116 మంది అభ్యర్థుల్లో 38 మంది మహిళలను ఒంగోలు పీటీసీకి, 78 మంది పురుషులను చిత్తూరు పీటీసీకి శిక్షణకు వేశారు. ఈ సందర్భంగా వారితో పోలీస్ బ్యారెక్స్‌లో శనివారం ఎస్పీ మమేకమయ్యారు. శిక్షణలో నేర్చుకోవాల్సిన అంశాలను వివరించారు. శిక్షణలో ప్రతిభ చూపి జిల్లాకు పేరుతీసుకురావాలని సూచించారు. సైబర్ నేరాలు, మోసాలను ఛేదించే నైపుణ్యాలు మన సొంతం కావాలన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ సౌమ్యలత, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.


