విద్యుత్ ఆదా ప్రాజెక్టుకు తృతీయస్థానం
పాలకొండ రూరల్: మండలంలోని ఎం.సింగుపురం జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు అలజంగి వినోద్‌కుమార్, ఆర్నాల కార్తీక్, శంబాన గణేష్ విద్యుత్‌ఆదాపై రూపొందించిన షార్ట్ ఫిలిమ్ రాష్ట్ర స్థాయిలో తృతీయ స్థానంలో నిలిచింది. పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు కె.సంతోష్ కుమారస్వామి దర్శకత్వంలో విద్యుత్ ఆదాపై రూపొందించిన రెండు నిమిషాల నిడివిగల షార్ట్ ఫిలిమ్‌ను పోటీల్లో ప్రదర్శించారు. విద్యుత్ ఆదా.. భవిష్యత్తు తరాలకు విద్యుత్ పొదుపు అనే అంశాన్ని ప్రస్పుటించారు. బహుమతి సాధించిన విద్యార్థులను పాఠశాల హెచ్‌ఎం బి.సంగంనాయుడు, ఉపాధ్యాయులు మంగళవారం అభినందించారు. విజయవాడలో త్వరలో జరగనున్న ప్రత్యేక కార్యక్రమంలో విద్యార్థులు రూ.5వేలు నగదు అందుకోనున్నారు.
‘కౌశల్’ విజేతలకు
బహుమతుల ప్రదానం
● రాష్ట్రస్థాయి పోటీలకు 12 మంది ఎంపిక
పార్వతీపురం టౌన్: భారతీయ విజ్ఞాన మండలి, ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కౌశల్ ఆన్‌లైన్ పోటీల జిల్లా స్థాయి విజేతలకు డీఈఓ బ్రహ్మాజీ బహుమతులు ప్రదానం చేశారు. నవంబర్ 26, 27 తేదీల్లో ఆన్‌లైన్‌లో నిర్వహించిన పోటీల్లో 8, 9, 10వ తరగతి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో క్విజ్, పోస్టర్ ప్రజెంటేషన్ (8, 9 తరగతులకు), రీల్స్ (10వ తరగతికి) విభాగాల్లో విజేతలను ఎంపిక చేశారు. పార్వతీపురం డీవీఎం హైస్కూల్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో మొదటి ఇద్దరు విజేతలకు రూ.1500, రూ.1000 చొప్పున బహుమతులు అందజేశారు. జిల్లా స్థాయిలో బహుమతులు పొందిన 12 మంది విద్యార్థులు ఈ నెల 27వ తేదీన తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో జరగనున్న రాష్ట్రస్థాయి కౌశల్ పోటీల్లో తలపడనున్నారు. కార్యక్రమంలో కౌశల్ జిల్లా కోఆర్డినేటర్ కోట అయ్యప్ప, అకాడమీ కోఆర్డినేటర్ బెహరా సంతోష్ కుమార్, జిల్లా సైన్స్ ఆఫీసర్ జి.లక్ష్మణరావు, పార్వతీపురం ఎంఈఓ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.
క్విజ్: ప్రథమ బహుమతి: ఎన్.లోకేష్ (8వ తరగతి, జెడ్పీ హెచ్‌ఎస్, ఎంఆర్ నగరం), డి.పవన్ కల్యాణ్ (9వ తరగతి, జెడ్పీహెచ్‌ఎస్, మక్కువ 3) కె.సాయి శరత్‌కుమార్ (10వ తరగతి, జెడ్పీహెచ్‌ఎస్ రావివలస)
ద్వితీయ బహుమతి: కె.ప్రసన్న (8వ తరగతి, జెడ్పీహెచ్‌ఎస్, రావివలస), ఎం.హిజ్కియారాజు (9వ తరగతి, జెడ్పీహెచ్, ఎంఆర్ నగరం), పి.రోహిత్ (10వ తరగతి, జెడ్పీహెచ్‌ఎస్, కురుపాం)
● పోస్టర్ ప్రజెంటేషన్ (8వ తరగతి పోటీలు)లో ఎం.లిఖిత (జెడ్పీహెచ్, ఎం.ఆర్.నగరం) ప్రథమ, ఎస్.భారతమ్మ (జీటీ డబ్ల్యూఏ హెచ్‌ఎస్, హడ్డుబంగి) ద్వితీయ.
● పోస్టర్ ప్రెజెంటేషన్ (9వ తరగతి)లో... ఏ.కీర్తన (జెడ్పీహెచ్‌ఎస్–ఎం.ఆర్.నగరం) ప్రథమ, టి.హారిక (జెడ్పీహెచ్‌ఎస్–మక్కువ) ద్వితీయ.
● రీల్స్ (10వ తరగతి) పోటీల్లో బి.లిఖిత్ (ఏపీ ఎంఎస్, భామిని) ప్రథమ, వి.సుజ్విన్ (జెడ్పీహెచ్‌ఎస్, కురుపాం) ద్వితీయ.
వంగర: మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు కుడి ప్రధాన కాలువకు అధికారులు సాగునీటి సరఫరాను పెంచారు. రబీ పంటల సాగుకోసం ఇటీవల 200 క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టగా... ప్రస్తుతం మరో 200 క్యూసెక్కుల నీటిని పెంచి 400 క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నట్టు ఏఈ నితిన్ తెలిపారు. ప్రాజెక్టు వద్ద 64.60 మీటర్ల నీటిమట్టం నమోదైనట్టు ఆయన వెల్లడించారు.
విద్యుత్ ఆదా ప్రాజెక్టుకు తృతీయస్థానం
విద్యుత్ ఆదా ప్రాజెక్టుకు తృతీయస్థానం


