ఎడతెగని చర్చలు | - | Sakshi
Sakshi News home page

ఎడతెగని చర్చలు

Dec 4 2025 8:42 AM | Updated on Dec 4 2025 8:42 AM

ఎడతెగ

ఎడతెగని చర్చలు

ఎడతెగని చర్చలు

గిరిజన రైతుల కన్నీరు

ఈ సమావేశంలో కూడా దశాబ్దాల కాలంగా నేల తల్లినే నమ్ముకుని ఉన్నాం..మేము సాగు చేస్తున్న భూములు లాక్కుని మాకు అన్యాయం చేయకండని గిరిజన రైతులు కన్నీరు పెట్టుకున్నారు.ఏపీఐఐసీకి కేటాయించక ముందు నుంచి ఆ భూమిలో సాగు చేస్తున్నామని, తాము మొక్కలు వేస్తున్నప్పుడు కూడా ఎవరూ అడ్డుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. సుమారు 30 కుటుంబాలకు చెందిన తామంతా పిల్లలతో వివిధ పంటలు సాగు చేసుకుని బతుకుతున్నామని మమ్మల్ని ఇబ్బంది పెట్టొదని వాపోయారు. పంటలు చేతికొస్తున్న సమయంలో పరిశ్రమల ఏర్పాటు పేరుతో ఏపీఐఐసీ అధికారులు మొక్కజొన్న, మామిడి, జీడిమామిడి తదితర పంటలు నాశనం చేశారని,అదే జీవనాధారంగా బతుకుతున్న ఆ భూములు లాక్కోవడం అన్యాయమని కన్నీరుమున్నీరయ్యారు. ఈ భూములు ఇచ్చేస్తే తర్వాత తరాలకు జీవనోపాధి లేక ఇబ్బందులు పడతారని ఒక్కో కుటుంబానికి రూ.8 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వడంతో పాటు మాకు ఇస్తామన్న భూమిలో సాగుకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు.

రామభద్రపురం: మేము సాగు చేసుకుంటూ జీవనాధారం పొందుతున్న భూములకు మెరుగైన పరిహారం ఇవ్వడంతో పాటు మాకు చూపిస్తున్న భూముల్లో సాగుకు అవసరమైన సౌకర్యం కల్పించాలని కాకర్లవలస, కారేడువలస గిరిజన రైతులు డిమాండ్‌ చేశారు. రామభద్రపురం మండలంలోని కొట్టక్కి రెవెన్యూ, మిర్తివలస పంచాయతీ పరిధి కాకర్లవలస, కారేడువలస గ్రామాల మధ్య 2017లో అప్పటి టీడీపీ ప్రభుత్వం సుమారు 187.08 ఎకరాల భూమిని రూ.7.48 కోట్లకు ఏపీఐఐసీకి విక్రయించింది.అయితే అ భూమిలో ఏపీఐఐసీ సుమారు ఆరు ఏళ్ల వరకు కనీసం ఒక్క పరిశ్రమ పెట్టలేదు సరికదా, భూమి ఎక్కడుందో?ఎలా ఉందో? ఎవరు ఆక్రమించుకున్నారో అని కనీసం కన్నెత్తి చూడని పరిస్థితి ఉంది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఏపీఐఐసీకి సంబంధించిన భూమిలో ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటు కోసం 20 ఎకరాల భూమిని కేటాయించిది. ఆ 20 ఎకరాల్లో చిన్న, పెద్ద పరిశ్రమల ఏర్పాటుకు ఒక్కొ ప్లాట్‌ 300 స్క్వేర్‌ ఫీట్స్‌ చొప్పున 139 ప్లాట్లుగా చేశారు.ఒక్కో స్క్వేర్‌ ఫీట్‌ రూ.1112లు ధర నిర్ణయించారు. అలాగే ఎస్సీ, ఎస్టీలు పరిశ్రమలు స్థాపించి ఆర్ధికంగా అభివృద్ధి చెదుతామని ముందుకు వస్తే వారికి 50 శాతం రాయితీపై ప్లాట్‌లు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ముందుగా 1.3 కిలో మీటర్ల రోడ్లు, డ్రైన్లు అభివృద్ధి కోసం రూ.4 కోట్లు నిధులు విడుదల చేసింది. దాంతో మే నెల 10వ తేదీన మంత్రి కొడపల్లి శ్రీనివాస్‌, ఎమ్మెలే బేబీనాయన, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడులు శంకుస్థాపన కూడా చేసిన విషయం విదితమే. సంబంధిత కాంట్రాక్టర్‌ జూలై నెలలో రోడ్లు,డ్రైన్లు అభివృద్ధి కోసం పనులు ప్రారంభించారు. ఈ క్రమంలో ఏపీఐఐసీకి సంబంధించిన భూమిలో ప్రస్తుతం పత్తి, మొక్కజొన్న, మామిడి, జీడితోటలు సాగు చేస్తున్న గిరిజన రైతులకు కనీసం నోటీసు ఇవ్వడకుండా జేసీబీతో పంటలను ధ్వంసం చేశారు. దీంతో తమ సాగులో ఉన్న భూముల్లో ఎలా రోడ్లు ఎలా వేస్తారని గత 5 నెలలుగా గిరిజన రైతులు నిరసనలు, ధర్నాలు చేస్తూ అభివృద్ధి పనులు అడ్డుకుంటున్నారు. ఏపీఐఐసీ అధికారులు, రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు పలుమార్లు గిరిజన రైతులతో సమావేశమై చర్చలు జరిపారు. అయినప్పటికీ గిరిజన రైతులు ససేమిరా అనడంతో చర్చలు విఫలమయ్యాయి. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో బుధవారం మరోసారి తహసీల్దార్‌ అజూ రఫీజాన్‌, సీఐ కె నారాయణరావు, ఏపీఐఐసీ డీఈ విజయ చంద్ర, జేఈ రాజేష్‌లు మిర్తివలస సర్పంచ్‌ మజ్జి రాంబాబు, సీఐటియూ నాయకుడు బలస శ్రీనివాసరావు సమక్షంలో గిరిజన రైతులతో సమావేశమయ్యారు.

మా సంతకాలు లేకుండా తీర్మానం ఎలా?

సమావేశంలో సర్పంచ్‌ మజ్జి రాంబాబు మాట్లాడుతూ మిర్తివలస పంచాయతీ పరిధిలో ఉన్న సర్పంచ్‌, గ్రామ ప్రజల సంతకాలు లేకుండా కొట్టక్కి రెవెన్యూ పరిధిలో ఉన్నంత మాత్రాన ఆ సర్పంచ్‌ సంతకంతో తీర్మానం ఎలా చేస్తారు? నోటిఫికేషన్‌ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. అలాగే మా నిధులతో రోడ్లు అభివృద్ధి చేసుకుంటే ఏపీఐఐసీ అధికారులు ఆ రోడ్డును ఎలా వినియోగించుకుంటారని నిలదీశారు. గిరిజన రైతులకు న్యాయం

ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటును

అడ్డుకుంటున్న గిరిజన రైతులు

గిరిజన రైతులతో మరోసారి

సమావేశమైన అధికారులు

పరిహారం ఇచ్చి..సౌకర్యాలు

కల్పించాలని రైతుల డిమాండ్‌

ఉన్నతాధికారుల దృష్టిలో పెడతామన్న అధికారులు

జరిగే వరకు వారికి మద్దతుగా తాము నిలబడతామని స్పష్టం చేశారు. దీంతో ఏపీఐఐసీ డీఈఈ మాట్లాడుతూ ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటుకు మే నెలలో అందరికీ తెలిసేలా పెద్ద షామియానాలు, కర్టెన్లు, కార్పెట్లు వేసి మంత్రులు, ఎమ్మెల్యే, ఎంపీ వచ్చి శిలాఫలకం ప్రారంభిస్తే అప్పట్లో అడ్డుకోకుండా ఇప్పుడు అడ్డుకోవడం మంచిది కాదన్నారు.అలాగే ప్రభుత్వానికి రూ.7.48 కోట్ల డబ్బులు ఇచ్చి ఏపీఐఐసీ కొనుగోలు చేసిందని, భూమి ఊరకనే రాలేదని మీరు పరిహారం అడగడం సబబుకాదన్నారు. తహసీల్దార్‌ అజు రఫీజాన్‌ స్పందిస్తూ మీ డిమాండ్‌లు రాసి ఇవ్వాలని, ఉన్నతాధికారుల దృష్టిలో పెడతామని సూచించారు. ఈ చర్చల్లో గిరిజన రైతులు కోరిన కోరికలకు తతంగమంతా మళ్లీ మొదటికొచ్చే విధంగా కనిపిస్తోంది.

ఎడతెగని చర్చలు1
1/2

ఎడతెగని చర్చలు

ఎడతెగని చర్చలు2
2/2

ఎడతెగని చర్చలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement